WHAT IS “VOTERSHIP”ACT ఆర్థిక భద్రతా చట్టం అంటే ఏమిటి ? # ఓటర్ షిప్ లేదా ఆర్థిక భద్రత లేదా ఆర్థిక స్వేచ్ఛ లేదా సామాజిక భద్రత / Economic Freedom/ Social security



                                                 
          




WHAT IS “VOTERSHIP”ACT
ఆర్థిక భద్రతా చట్టం అంటే ఏమిటి ?
(ఓటర్ షిప్ లేదా ఆర్థిక భద్రత లేదా ఆర్థిక స్వేచ్ఛ లేదా సామాజిక భద్రత)
(Economic Freedom/ Social security)



A part of per capita production of Union of India, to be Received regularly in form of cash by every voter who is Enrolled on electoral roll prepared by Election Commission of India for elections of LOK SABHA, by ATM cash card Or any other similar transparent means, As their share in gross national inherited wealth and in the Collective wealth produced by collective enterprise of all Voter, as a contrivance.

To enhance the dignity of work of individual in relation to one’s birth status. 

·       To compensate citizens who are suffering from the world consumers, world traders and from the policies of WTO.

·       To create fifth pillar in the building of democracy adopting the new structure of power
And of laws based on the basic principles of economic democracy.

·       To provide opportunity for full development of inherent shape, size and nature of society And full development of inherent physical, mental and spiritual strength   of individual.

·       To connect each and every voter with the level of prosperity of nation.

·       To make social security, economic human right, right to live and getting their share in Average collective property; fundamental right of all the voters. “Votership” is a newly Coined word like scholarship to denote a part of GDP in form of cash to be received regularly by every voter as his or her birthright.


 JAYA PRAKASH BHARAT, 
President Economic Freedom.


“VOTER SHIP” IS “VOTER BIRTH RIGHT”

 ఆర్థిక భద్రతా చట్టం

ఓటర్ షిప్ లేదా ఆర్థిక భద్రత లేదా ఆర్థిక స్వేచ్ఛ లేదా సామాజిక భద్రత)

ఇప్పుడు భారతీయులకు కావలసింది " ఆర్ధిక స్వాతంత్ర్యం"
"ఆర్ధిక స్వాతంత్ర్యంభారత దేశానికి రాలేదు.

దేశం అందరిదీ. దేశం యొక్క సంపద పై అందరికి హక్కు ఉంది. దేశం సంపాదిస్తున్న ప్రతి పైసా మీద ప్రతి ఓటర్ కు అనుభవించే హక్కు ఉంది . ఇది ప్రతి ఓటర్  యొక్క జన్మ  హక్కు .
ఒక ఇంటి యజమాని, తన ఇంటి మీద వచ్చే కిరాయను ఆదాయ  రూపంలో ప్రతినెలా  ఏవిదంగా అయితే తీసుకుంటున్నాడో  అదే విదంగా ప్రతి ఓటర్ కూడా తన దైన దేశ ఆస్తిలో కిరాయను,ఆదాయాన్ని తీసుకోవడాన్ని VOTERSHIP అంటారు .
దేశ పార్లమెంటును, రాష్ట్ర పతి భవనంను, గవర్నర్ భవనంను, అసెంబ్లీ ను, తహసిల్దారు ఆఫీసులను, సుప్రీమ్ కోర్ట్ లను, హైకోర్ట్ లను, కలెక్టర్ ఆఫీసు లను, రక్షణ, పోలీస్ సమస్త  దేశ రాజకీయ వ్యవస్థను నిర్మించినది నడుపుతున్నది దేశ ఓటర్. దేశాన్ని, భారత ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్లమెంటును, రాజ్యాంగాన్ని నిర్మించింది VOTER, ప్రభుత్వ రాజకీయ నాయకులని, ఎన్నుకున్నది VOTER. దేశం ప్రతి ఒక్క VOTER కి సంబంధించిన నైతిక ఆస్తి. సంకీర్ణ ఆస్తికి ఓటర్ పూర్తి హక్కు దారుడు మరియు అసలు మూలస్వామి. ఇదియే ప్రజాస్వామ్యం యొక్క మూల స్వరోపం.
నీళ్లు, అడవులు, భూమి, చట్టాలు, ఎండా, వానలు, యంత్రాల కారణంగా ఉత్పత్తి అవుతున్న, అనగా వీటి ద్వారా తయారవుతున్న డబ్బు ధనం ఇదంతా ఓటర్ల యొక్క సంకీర్ణ సంయుక్త ఆస్తి. సంపద మీద వచ్చే కిరాయను ఓటర్ కి పంచడాన్ని ఓటర్ షిప్ లేదా ఓటర్ పెన్షన్  అంటారు . ఇది ఓటర్ యొక్క జన్మ హక్కు .
ఇది  మన ప్రతి voter యొక్క జన్మహక్కు. హక్కు ద్వారా ప్రతి voter "ఆర్థిక భానిసత్వం నుండి , పేదరికం నుండి  మరియు అన్ని అసమానత్వాల  నుండి   దేశ ఓటర్లు అందరు బయట పడతారు , అందరు ఓటర్లు ఆర్ధిక స్వేచ్ఛతో ఆనందనగా జీవిస్తారు.
VOTERSHIP”చట్టం అమలులోకి వస్తే దేశంలో రైతుఆత్మహత్యలు,ఆకలిచావులు,ఆర్ధిక చావులు,దొంగతనాలు,దోపిడీలు, వ్యభిచారం,హత్యలు,నిరుద్యోగం,అనారోగ్య చావులు ,అసమానత్వాలు మరి ఇంకా ఎన్నో సమస్యలను పూర్తిగా అధిగమించవచ్చు.
రాజరిక వ్యవస్థ నశించిన తరువాత ప్రజాస్వామ్యం అవతరించినప్పుడు ప్రజలే దేశ మూలస్వాములు. ప్రజాస్వామ్యంలో ప్రజలే స్వాములు అన్నదే ప్రజా స్వామ్యం యొక్క నిజమైన అర్ధం.
 కానీ స్వాతంత్య్రం వచ్చిన తరువాత కొంతమంది బలవంతుల మరియు పెట్టుబడిదారుల చేతిలో దేశం స్వాతంత్ర్య ఫలాలు చిక్కుకున్నాయి. ప్రజల చేతిలో  పూర్తి  ఫలాలు అందలేదు అన్నది కఠోర సత్యం . దేశ సంపద కేవలం కొద్దీ మంది చేతిలో మాత్రమే చిక్కుకొని పోయింది.
కారణం చేత 90 % ప్రజలు బానిసత్వ బ్రతుకులు బతుకుతున్నారు. 70  సంవత్సరాల  స్వాతంత్య కాలం గడిచిన ఇంకా సామాన్యుడు తిండి కోసం దేశంలో పని చేస్తున్నాడు. తనకు labour ను అమ్ముకొనే స్వేచ్ఛ దేశంలో లేదు. దేశానికి ఆర్ధిక స్వాతంత్య్రం చాలా అవసరం . అది దేశం లో లేదు .మహాత్మా గాంధీ కూడా స్వాతంత్య్రం సాధించిన మరుసటి రోజు నుండి నేను ఆర్ధిక స్వాతంత్య్రం మొదలు  పెడుతానని చెప్పాడు.
పూర్వం దేశంలో మనుషులందరికీ సమానంగా ఆవులను,పశువులను మేకలను గోర్లను  పంచుమన్న కమ్మూనిస్ట్ సిద్ధాంతం  సమంజసమైనప్పటికీ , అది అమలు కాదు,కాలేదు.వారి ఆలోచనలు నీతివంతం అయినప్పటికీ ,అందులో సమానత్వ భావాలూ ఉన్నపటికీ కూడా , సిద్దాంతాన్ని ఎవరు  అమలు పరుచలేరు .
 ఎదుకంటే 100 మంది ప్రజలు ఉన్న చోట  60 ఆవులు మాత్రమే ఉన్నప్పుడు  సమానంగా పంచలేము.ఒకవేళ పంచిన అంతర్యుద్ధాలు మొదలయ్యీ యుద్దాలు జరిగే అవకాశం వుంది .
అందుకే 60 ఆవులను సమానంగా పంచలేము కానీ 60  ఆవులు ఇచ్చే పాలను మాత్రం సమానంగా కొలిచి 100 మంది కి సమానంగా పంచవచ్చు.ఇదే సరి అయిన పద్ధతి. పద్ధతినే అములు పరుచుమంటున్నాము  (ఓటర్ షిప్ ఆక్ట్) VOTERSHIP ACT ను తీసుకు రావడంతో .
హక్కు రాజ్యాగం లో ని ఆర్టికల్ 14 మరియు 15 ను  పూర్తిగా అమలు పరుస్తుంది.
 VOTERSHIP   రాజ్యాంగానికి “5 స్తంబంలా ( 5 TH PILLAR గా )” పనిచేస్తుంది.
ఓటర్ యొక్క సంపదను తన వంతు రావలసిన ఆదాయాన్ని లెక్క కట్టడానికి ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ అవసరం. దాని యొక్క పూర్తి వివరాలను పార్లమెంటు స్టాండింగ్ కమిటీ కి సాక్షద్వారాల, పూర్తి ఆచరణ పద్దతిలో చూపించడం జరిగింది. ప్రపోసల్ ను పార్లమెంటు లో పిటిషన్ రూపంలో 137 మంది పార్లమెంట్  సభ్యుల  సమ్మతి అంగీకారం తీసుకొని ప్రవేశపెట్టడం జరిగింది. యొక్క గొప్ప చారిత్రాత్మక పిటిషన్ ను పార్లమెంట్లో చర్చకు రాకుండా కొన్ని పెట్టుబడి దారుల శక్తి చేతిలో నడుస్తున్న ప్రస్తుత రాజకీయ పార్టీలు చట్టాన్ని తీసుకు రావడంలో ప్రతి సారి  అడ్డు వేశాయి.

2005  లో ప్రతి ఓటర్ కు 1750  రూపాయలు ఉన్నటువంటి VOTERSHIP మొత్తం, ఇప్పుడు ఉన్నటు వటువంటి లెక్కల ప్రకారం ప్రతి ఓటర్ కి సుమారు 5000 రూపాయలకి VOTERSHIP మొత్తం చేరుకుంది.  దీనిని జీడీపీ ఆధారంగా గుర్తిస్తారు . ఇది జీడీపీ లో సాగ భాగం ఉంటుంది. ప్రతి సంవత్సరం పెరుగు తుంది. VOTERSHIP  RBI  బ్యాంకు ప్రతి నెల ప్రతి ఓటర్ అకౌంట్ లో జమ చేస్తుంది పాలసీ ప్రకారం. ప్రతి VOTER కు ప్రతి నెల కొంత డబ్బును VOTERSHIP రూపంలో ATM ద్వారా డ్రా చేసుకునే విధంగా వారి VOTER ఎకౌంటులో, ఒక సరి అయిన పద్దతిలో బ్యాంకుల ద్వార ప్రతి VOTER ఎకౌంటుకి ప్రతి నెల దేశ ప్రభుత్వం డైరెక్ట్ గా కొంత డబ్బును   TRANSFER  చేయాలి. దీనినే  VOTERSHIP అంటారు.
 అంతే కాదు ప్రపంచ దేశాలు పేదరికం నిర్మూలనకు, అందరు ఆర్ధికంగా స్థిర పడాలని కృషి చేస్తున్న, ప్రపంచ దేశాల నిధులు డైరెక్ట్ గా ఓటర్ బ్యాంకు ఎకౌంటు లోకి చేరుతాయీ, దీనిద్వారా నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం లేదు. నిధుల ద్వారా, ప్రభుత్వ ఇతర  పథకాల ద్వారా, ప్రతి ఓటర్ యొక్క నెలసరి income పెరిగే అవకాశం ఉంది.
ఓటర్ షిప్  చట్టం ద్వార పేదరికాన్ని పూర్తిగా అంతం చేయ వచ్చు .ప్రతి ఓటర్ పూర్తీ ఆర్థిక స్వేచ్చతో ప్రతి ఓటర్ తన ఆర్ధిక  పరిస్థిని మెరుగు పరచు కోవచ్చు . దేశంలోని ప్రజల  పేదరికాన్ని కేవలం డబ్బును పంచె అంతం చేయగలం , అంతేగాని  ప్రజల పేరిట పతకాలా పేరిట, స్కీంల పేరిటస్కాములు నాయకులు  చేయడం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమిలేదు ఇంతవరకు.
ప్రజల డబ్బు ప్రజలకు పంచడానికి ఇన్ని స్కీం లు, ఇన్ని పాలసిలు, ఇన్ని గవర్నమెంట్ శాకాలు, ఇన్ని  మంత్రిత్వశాఖలు  అనవసరం. ఉదాహరణకు ఒక ఐస్ ముక్కను అందరి చేతులు మారే వ్యవస్థలో చివరి వాడికి మిగిలేది కేవలం ఓట్టి నీటి చుక్కగా మనం గమనించవచ్చు.
నా ప్రియమైన VOTERS, అంశం, మీ అందరికి  ఒక  కొత్త ప్రశ్నగా  అంశంగా అనిపించవచ్చు, కానీ ప్రశ్నను 70 సంవస్త్సరాల  స్వాతంత్ర్యము తరువాత  ప్రభుత్వంను గుర్తించక పోవడం సిగ్గుచేటు.
దేశ సేవ చేయడానికి రాజకీయ నాయకులూ MP లు మరియు MLA లు  జీతాలు , ఇల్లు , కార్లు, విమానయాన  సదుపాయాలు, అత్యంత విలాసవంతమైన భోగాలు అనుభవిస్తున్నారు. అంతేకాకుండా పదవి విరమణ తరువాత పెన్షన్ కూడా తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ ఐనప్పుడు  MP, MLA లను చేసి, దేశ ఆర్ధిక వ్యవస్థలో ప్రతి నిత్యం భాగమైన ఓటర్ కు ఎటువంటి ఆదాయం లేదు . ఎందుకని  ?...
ప్రపోసల్ ను పార్లమెంటు లో పిటిషన్ రూపంలో 137 మంది పార్లమెంట్  సభ్యుల  సమ్మతి అంగీకారం తీసుకొని ప్రవేశపెట్టడం జరిగింది. యొక్క గొప్ప చారిత్రాత్మక పిటిషన్ ను పార్లమెంట్లో చర్చకు రాకుండా కొన్ని పెట్టుబడి దారుల శక్తి చేతిలో నడుస్తున్న ప్రస్తుత రాజకీయ పార్టీలు చట్టాన్ని తీసుకు రావడంలో ప్రతి సారి  అడ్డు వేశాయి.

Figures relating to votership in Parliament
1) The number of MPs moving the proposal of votership 137
In Parliament under Rule 168 during the year 2006-08
2) The Number of Loksabha MPs 112
3) The number of Rajyasabha MPs 25
4) The number of BJP MPs 54
5) The number of SP MPs 19
6) The number of BSP and Congress MPs 08
7) The number of CPM, CPI, JD (U) MPs 00
8) The number of RJD and JM MPs 04
9) The number of RSP MPs 03
10) The number of BJD, AGP MPs 02
11) The number of SDF, MNF, NLF, JKNC, RLD, MDMK, DMK 01
12) The number of MPs seeking debates on votership in Parliament 33
under rule 193
లోక్ సభ మరియు రాజ్య సభ సబ్యులైనటువంటి 137 MP లు కలసి శ్రీ భరత్ గాంధీ గారి పిటిషన్ ను పార్లమెంట్లో సంయుక్త ఆస్థి భాగాన్ని ( COLLECTIVE SHARE ) ఇండియన్ VOTERS కు పంచడానికి, ఒక కొత్త చట్టాన్ని అమలు చేయడానికి భారత  పార్లమెంట్లో ప్రవేశ పెట్టడం జరిగింది.కానీ చట్టం అమలు పరచక పోవడం ప్రజాస్వామ్యానికే కలంకం .

VOTERSHIP  పిటిషన్ ను పార్లమెంట్ లో తీసుకువెళ్ళింది శ్రీ భరత్ గాంధీ గారు , మరియు ఫెడరేషన్ ఫర్ ఎకనామిక్ ఫ్రీడమ్ సభ్యలు. ప్రపంచంలో కొన్ని దేశాలు బేసిక్ ఇన్కమ్  పేరుతో ఆచరణలోకి తీసుకువచ్చాయి .
VOTERSHIP గురుంచి మరియు  పిటిషన్ కు సంబంధించి రాష్ట్రాల వారిగా, తేదిల వారిగా, పార్లమెంట్ సబ్యుల పేర్ల వారిగా మరియు వారి నియోజకం వారిగా ఉన్న పట్టికను  మీ ద్వారా ప్రజలకు చేరవేయదలిచాను. విషయాన్నీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి .

“VOTER SHIP” IS “VOTER BIRTH RIGHT”
"VOTERSHIP "   ఇవ్వండి, పేదరికాన్ని నిర్ములించండి.
VOTER కు కిరాయి చెల్లించండి .
దేశంలో VOTER కు రావలసిన ఆదాయాన్ని (VOTERSHIP ) VOTER కు ఇవ్వండి .
దేశ ప్రభుత్వాలు VOTER కు కిరాయి చెల్లించాలి.
VOTERSHIP ప్రతి ఓటర్ జన్మ హక్కు. రాజకీయాలు సంస్కరిద్దాం - వ్యవస్థను మారుద్దాం.
పార్లమెంట్ లోని విషయాన్నీ సామాన్య జనాలకు తెలియకుండా, పత్రిక మీడియా రంగాలకు తెలియకుండా కుట్ర పన్నడం జరిగింది. 137 మంది పార్లమెంట్ సభ్యులచే & శ్రీ భారత్ గాంధీ చే పార్లమెంట్లో చర్చకు ప్రవేశ పెట్టడం జరిగింది. తరువాత చాల కాలం తరువాత పార్లమెంట్ స్టాండింగ్ committee   ఆధ్వర్యంలో ఎన్నో చర్చలు జరిపిన తరువాత చివరికి  2011 డిసెంబర్ 6 మంజూరు చేయబడింది.
కానీ ఇతరుల బాధలను చూసి ఆనందించే కుటిల రాజకీయ నాయకులూ విషయాన్నీ ప్రజలకు తెలియకుండా మరియు  ఇటు పత్రిక మీడియా రంగాలలో ప్రచారం కాకుండా చేసారు .
ఇప్పుడు ప్రభుత్వం ఓటర్లకు డబ్బును పంచాలి. ప్రతి నెల, ప్రతి ఓటర్ బ్యాంకు అకౌంట్లో డబ్బును జమ చేయాలి, దేశ సంపదలో ఓటర్ యొక్క తన ఆస్తిలోని భాగాన్ని ప్రతి ఓటర్ కు పంచాలి. అనగా జీడీపీ సగం అన్నమాట. డివైడ్ జీడీపీ 50/50. చట్టం అమలులోకి వస్తే ఇప్పటి నుండే ప్రతి ఓటర్ కి ప్రతి  నెలకు  రూపాయలు 5000/-(2017) పైన వస్తాయి.
డబ్బులు ఎందుకు అడుగుతున్నామంటే?  చదువుకున్న వాళ్ళ  పనిని కంప్యూటర్ తినేసింది, మరియు చదువు కొనని వాళ్ళ  పనిని బుల్డోసర్, ట్రాక్టర్ JCB యంత్రాలు, పెద్ద మెషిన్లు తినేసాయి. ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితిలో రోజులు గడవడం బతుగు బండి నడపడం కష్టం.  ఆత్మ గౌరవంగా జీవించడం కష్టం. ఇటు వంటి సందర్భంలో యంత్రాల సంపాదిస్తున్న డబ్బును తిరిగి ఓటర్ కి పంచాలి . ఇప్పుడు ఒక కొత్త విప్లవం వచ్చింది, యంత్రాలు సంపాదిస్తున్న డబ్బును ప్రభుత్వం స్వయంగా ఓటర్ లకు పంచడం.
  

 Written by,  
JpBharat (JayaPrakash Bharat),
President,ECONOMIC FREEDOM MOVEMENT, 
Working President, NEW INDIA PARTY, 
9100 505556, 9441 25 6545



















Comments

Popular posts from this blog

#స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం.#సంతోషపడకండి,#బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి.