Economic Freedom is Every Voter Birth Right.









        






31.01.2020
PRESS NOTE
To,
The Editor,

Sub:ఆర్ధిక స్వేచ్ఛ ప్రతి ఓటరు యొక్క జన్మహక్కు”
 ఆర్ధిక స్వాతంత్య్ర ఉద్యమం. భారత దేశ ప్రజలకు  స్వాతంత్య్రం వచ్చింది కానీ  ఆర్ధిక స్వాతంత్య్రం రాలేదు .ఆర్ధిక స్వాతంత్య్రంతో సంపూర్ణ స్వరాజ్యం సాధించవచ్చు.

నేతల రాజ్యం కాదు ఓటర్ల రాజ్యం రావాలి. దేశ సంపదలో ప్రతి ఓటరును భాగస్వామ్యం చేయాలి, దేశ తలసరి ఆదాయంలో ప్రతి ఓటరు యొక్క ఆదాయాన్ని ప్రతి నెల ఓటరు అకౌంట్ లో జమచేయాలి. దీనినే ఓటర్ షిప్ అంటారు. ఆర్ధిక స్వేచ్ఛ ప్రతి ఓటరు యొక్క జన్మహక్కు” ఈ హక్కు యాచన కాదు ఇది ఓటర్ జన్మహక్కు హక్కు అని  దీనికోసం దేశ ప్రజలందరూ ఆర్ధిక స్వాతంత్య్ర ఉద్యమంతో కలిసి పోరాడి సాధించుకోవాలని మిషన్ ఫర్ గ్లోబల్ చేంజ్, ఆర్ధిక స్వాతంత్య్ర ఉద్యమం మరియు ఓటర్ షిప్ చట్ట రూప కల్పనా కర్త శ్రీ విశ్వాత్మ భరత్ గాంధీ గారు తెలియచేసారు.

మన దేశంలో పేదరికము కాదు బానిసత్వము కొనసాగుతున్నది. పేదరికానికి  బానిసత్వానికి మధ్య తేడా తెలుకోండి. పేదరికానికి కారణం డబ్బు లేకపోవడం కాదు ,చట్టాలు సరిగ్గా లేకపోవడం. ధనవంతుడు ధనవంతుడిగా పేదవాడు పేదవాడిగా మారడానికి కారణం ఈ దేశంలో చట్టాలు సరిగ్గా లేకపోవడం.  “దేవుడు పేదరికాన్ని సృష్టించలేదు ప్రజలు పేదరికాన్ని సృష్టించుకున్నారు”. ఒక మనిషి ఇంకో మనిషిని దోచుకోవడం, పేదరికం, నిరుద్యోగం, పోషకాహారలోపం, నిరక్షరాస్యత అవినీతిని, రైతు,చేనేత ఆత్మహత్యలు, కర్షక కార్మిక ఆత్మ హత్యలు, ఆర్ధిక దోపిడలను, మతాల పేరిట ఘర్షణలు వర్గ విభేదాలు అంతమొందించాలంటే, ఈ వ్యవస్థ ను నిర్ములించాలంటే, దేశానికి కావలిసిన ఏకైక ఉద్యమం " సంపూర్ణ స్వరాజ్య ఉద్యమం ". సంపూర్ణ స్వరాజ్యం లేకుండా , మన సాధించుకున్న స్వాతంత్య్రంకు ఎటువంటి అర్ధం లేదు. భారత దేశ ప్రజలకు  స్వాతంత్య్రం వచ్చింది కానీ  ఆర్ధిక స్వాతంత్య్రం రాలేదు .
ఆర్ధిక స్వాతంత్య్రంతో సంపూర్ణ స్వరాజ్యం సాధించవచ్చు.
 ప్రతి ఓటరు యొక్క ఆర్థికాభివృద్ధిని దేశాభివృద్దిగా పరిగణించాలి, తద్వారా పేద మధ్యతరగతి  వ్యక్తుల జీవితాల్లో సుఖసంతోషాలు తీసుకువచ్చి  ధనిక  పేద తారతమ్యాలను తగ్గించి దేశ ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం, ఆర్ధిక స్వేచ్ఛను, సంపూర్ణ స్వరాజ్యాన్ని అందించాలి దీని కోసమే చేస్తున్న పోరాటం ఆర్ధిక స్వాతంత్య ఉద్యమం. మన పోరాటం నాయకులమీద రాజకీయ పార్టీల మీద కాదు, పూర్తి వ్యవస్థ మార్పుకై పోరాడాలి .      స్వాతంత్య్రం సాదించికున్నప్పటి నుండి రోజు వరకు దేశంలో ఎన్నో సమస్యలు మొదటి నుండి ఇంకా  కొనసాగుతున్నాయి.   సమస్యలను రాజకీయనాయులు  వారి పార్టీలు ప్రతి పక్షాలు అందరు కలిసి పక్క దోవ పట్టిస్తున్నారు, పెట్టుబడి దారుల, ధనవంతుల  చేతిలో నాయకులు, వారి పార్టీలు  బానిసలుగా కీలుబొమ్మగా మారారు. వీటిపై ప్రజలు యువత ఏకం కావాలి, ఇప్పుడు సమస్యకు సమాధానం చెప్పకుంటే ఇంకెప్పటికీ చెప్పలేం.  రాజ్యాంగంను అందులోని చట్టాలను మార్చవలసిన అవసరం ఎంతైనా వుంది. స్వరాజ్యాన్ని దేశ సంపద పై సమానత్వాన్ని అందరి హక్కులను , రాజకీయంగానూ, సామాజికంగానూ , ఆర్ధికంగానూ _ ఆర్ధిక స్వాంతత్య్ర ఉద్యమంతో కలిసి  పోరాడి సాధించుకోవాలి. అందుకోసం త్యాగాలు, పోరాటాలు, ఎటు వంటి కష్టాలనైనా, బాదలనైనా తట్టుకునే మనసత్త్వం కలిగిన యువత కావాలని Raise your voice on Economic Freedom ఇంక్విలాబ్ జిందాబాద్ అని  ఆర్ధిక స్వాతంత్య్ర ఉద్యమ అధ్యక్షులు జయ ప్రకాష్ భారత్ పిలుపునిచ్చారు.

                  పార్లమెంట్లో ప్రవేశ పెట్టబడిన ఓటర్ షిప్ & ఆర్ధిక స్వాతంత్య్ర ఉద్యమ పుస్తకాన్ని హిందీ నుండి తెలుగులోకి అనువదించినది  ప్రముఖ రచయిత మరియు సామాజిక వేత్త  శ్రీ చింతపల్లి కృష్ణ రావు గారు. పుస్తకానికి సూచనలు సహాయ సహకారాలు  అందించినది  ఆర్ధిక స్వాతంత్య్ర ఉద్యమ అధ్యక్షులు జయ ప్రకాష్ భారత్ గారు. కార్యక్రమంలో ఆర్ధిక స్వాతంత్య్ర ఉద్యమ పుస్తకాన్ని శ్రీ భారత్ గాంధీ గారి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ  చేసారు.


కార్యక్రమంలో  ప్రముఖ రచయిత , సామాజిక వేత్త శ్రీ ఎస్ సూర్య ప్రకాష్ గారు , ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ కోచ్ బాల రాజు గారు


ఈ పై విషయాన్నీ సామాన్య ప్రజలందరికి చేరే విదంగా ప్రతేకంగా ప్రచురించాలని, విలేఖరిని పంపించాలని తమరి ద్వారా కోరుతున్నాము.



Jaya Prakash Bharat,
President for Economic Freedom Movement & Common Men Forum.
9441 25 65 45  

Comments

Popular posts from this blog

VOTERSHIP ACT IN PARLIAMENT Representation from Economic Freedom Movement on Political Reforms.

#స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం.#సంతోషపడకండి,#బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి.