ఆర్థిక స్వాతంత్ర్య ఉద్యమం & ఆర్థిక భద్రతా చట్టం





ఆర్థిక స్వాతంత్ర్య ఉద్యమం
(నిర్వచనం,ఆవశ్యకాలు,పరిణామాలు,రాజకీయ సంస్కరణలు)
దేశ ప్రజలను బానిస సంకెళ్ళ నుండి విముక్తి చేయడం కోసం అలనాడు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బలిదానాలు చేసిన స్వాతంత్ర్య సమర యోధుల లక్ష్యమైన సంపూర్ణ స్వరాజ్యాన్ని,భావి భారత ప్రజలకోసం ఆశించిన,కోరుకున్న సమ సమాజాన్ని, నవ భారతాన్ని సాధించడం కోసం చేస్తున్న ఉద్యమమే “ఆర్థిక స్వాతంత్ర్య ఉద్యమం” .
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది కానీ స్వాతంత్ర్య ఫలాలు కొద్ది మంది స్వార్ధ దోపిడీదారుల చేతిలో చిక్కుకున్నాయి.భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది కానీ ఆర్థిక స్వాతంత్య్రం రాలేదు.
దేశ ప్రజలందరూ పేదరికానికి మరియు బానిసత్వానికి మధ్య తేడా  తెలుసుకోవాలి.
ఈ దేశంలో బానిసత్వం కొనసాగుతుంది.పోరాడవలసింది పేదరికం మీద కాదు బానిసత్వం మీద .
ఈ బానిసత్వ పై పోరాటమే ఆర్థిక స్వాతంత్ర్య ఉద్యమం.
దేశంలో ఆర్థిక స్వాతంత్య్రం  ప్రజలకు ఇవ్వకుండా  ప్రజాస్వామ్య దేశంలో  స్వాతంత్ర్యానికి ఎటువంటి అర్ధం లేదు. ప్రజాస్వామ్య దేశం అనిపించుకోదు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే స్వాములు. సకల సంపదకు దేశ ప్రజలే హక్కు దారులు,ఈ దేశ సకల సంపదకు ఈ దేశ ఓటరే యజమాని. దేశ సంపదకు పూర్తి హక్కు దారుడు ఈ దేశ ఓటరే.
దేశంలో ఆర్థిక న్యాయం జరగకుండా సామజిక న్యాయం జరగదు .
ఈ దేశ సకల వ్యవస్థను  నిర్మించినది, నడుపుతున్నది దేశ ఓటరే, ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది దేశ ఓటర్ సంక్షేమం కోసమే.
దేశం యొక్క సంపద ఫలాలను,ఆదాయమును,వికాసాన్ని,అభివృద్ధిని  అనుభవించే పూర్తి హక్కు ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటరుకు ఉంటుంది. ఇది ఓటర్ యొక్క యాచన కాదు ప్రతి ఓటర్ యొక్క జన్మ హక్కు . ఇదియే నిజమైన ప్రజాస్వామ్యం.ఈ నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయడమే ఆర్థిక స్వాతంత్ర్య ఉద్యమం. అలనాడు కోరుకున్న సంపూర్ణ స్వరాజ్యం.
* దేశ సంపదలో,వికాసంలో,అభివృద్ధిలో ప్రతి ఓటరును భాగస్వామ్యం చేయడమే ఆర్థిక స్వాతంత్ర్య ఉద్యమం.
* ఆర్థిక అసమానతలను రూపుమాపడమే ఆర్థిక స్వాతంత్ర్య ఉద్యమం.
*కొందరివద్దే కేంద్రీకృతమైన ఈ దేశ సంపద ఫలాల్లో దేశ ఓటర్లందరికి భాగస్వామ్యం కల్పించడమే ఆర్థిక స్వాతంత్య్ర ఉద్యమం.
*ప్రజాస్వామ్య దేశంలో ప్రజల డబ్బును ప్రజలు ఖర్చు చేసే స్వేచ్ఛ ను ప్రజలకు కల్పించడమే  ఆర్థిక స్వాతంత్య్ర ఉద్యమం.
*ధన బలస్వాముల, పెట్టుబడిదారుల, దోపిడీదారుల రాజకీయాలను కూకటి వేళ్ళతో పెకిలించి సామాన్యునిన్ని, బలహీనుణ్ణి  సైతం రాజకాల్లో ప్రవేశం కల్పించడం .
*భావి భారత దేశంలో ప్రతి వ్యక్తి యొక్క ఆర్థిక సామాజిక,ఆనందాభివృద్ధిని మెరుగుపరచడం , ప్రేమ, దయ, మానవత్వ , సమానత్వ భావాలను అందరిలో పెపొందిచడమే ఆర్థిక స్వాతంత్ర్య ఉద్యమం.
*నేతల రాజ్యాన్ని కాల రాసి ఓటర్ల రాజ్యాన్ని తీసుకువచ్చేది ఆర్థిక స్వాతంత్య్ర ఉద్యమం.

ఆర్థిక భద్రతా చట్టం
(ఓటర్ షిప్ లేదా ఆర్థిక భద్రత లేదా ఆర్థిక స్వేచ్ఛ లేదా సామాజిక భద్రత)
(నిర్వచనం,ఆవశ్యకాలు,పరిణామాలు,రాజకీయ సంస్కరణలు)
·       ఆర్థిక భద్రత ప్రతి ఓటరు యొక్క జన్మ హక్కు.
·       దేశ సంపద ఫలాలను ప్రభుత్వం ఆర్థిక రూపంలో ప్రతి ఓటర్ కు ప్రతి నెల చేరవేయడాన్ని ఓటర్ షిప్ లేదా ఆర్థిక భద్రత లేదా ఆర్థిక స్వేచ్ఛ లేదా సామజిక భద్రత అంటారు.
·       ప్రజాస్వామ్యం యొక్క మూల స్వరూపము మరియు అర్ధము సంపదకు అందరు హక్కు దారులే మరియు అందరు సమానులే, సమానత్వం  అనే సిద్ధాంతమునకు నిజమైన  ప్రజాస్వామ్య పధ్ధతి లో   ఈ దేశంలో  ఉన్న ప్రతి ఓటరుకు ప్రతి నెల దేశ సంపదలో తనదైన ఉత్తరదాయిత్వాన్ని,దేశ సంపదలో తనదైన భాగస్వామ్యాన్ని  ఆదాయ రూపేణా   ప్రతి ఓటర్ అకౌంట్లో కొంతసొమ్మును జమచేయడాన్ని ఓటర్ షిప్ లేదా ఆర్థిక భద్రత లేదా ఆర్థిక స్వేచ్ఛ లేదా సామాజిక భద్రతా చట్టం అని అంటారు.
·       ఆర్థిక భద్రత చట్టం ద్వారా ప్రస్తుత  ధరలను, ప్రస్తుత కాల ఓటరు ఆర్థిక అవసరాలను అనుసరించి ప్రతి నెల 5000/- రూపాయలు ప్రతి ఓటరు అకౌంట్ లో ప్రతి నెల జమ చేయడం.
·       దేశ సంపదలో, వికాసంలో, అభివృద్ధిలో ప్రతి ఓటరును భాగస్వామ్యం చేసేది ఆర్థిక భద్రత చట్టం.
·       నేతల రాజ్యాన్ని కాల రాసి ఓటర్ల రాజ్యాన్ని తీసుకువచ్చేది ఆర్థిక భద్రతా చట్టం.
·       ప్రజాస్వామ్య దేశంలో ప్రజల డబ్బును ప్రజలు ఖర్చు చేసే స్వేచ్ఛ ను కల్పిచడం ఆర్థిక భద్రత చట్టం .
·       పేదరికాన్ని పూర్తిగా, శాశ్వతంగా నిర్మూలించడం, దేశం లో ఒక్క పేదవాడు లేకుండా చేయడం.
·       దేశంలోని ఆర్థిక అసమానత్వాలను రూపుమాపడం.
·       ప్రతి ఓటరు కొనుగోలు సామర్థ్యాన్ని పెంచడం.
·       వస్తు ఉత్పత్తులకు ,చిన్న పరిశ్రమలు పెద్ద పరిశ్రమలకు ఒక రుజు మార్గంలో ప్రజాస్వామ్య పధ్ధతి లో  చేయూతనివ్వడం.
·       నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం.ప్రతి నిరుద్యోగి చేతితో పాటు మెదడుకు కూడా పని కల్పించి దేశ అభివృద్ధిలో దేశ అవసరాల దృష్ట్యా ప్రతి ఓటర్ ను ఓటరుయొక్క కర్తవ్యంగా  భాద్యతాయుతుణ్ణి చేయడం.
·       భారత దేశంలో ఎంతోమంది  మహిళలు  గృహ కర్తవ్యం నిర్వర్తిస్తూ దేశ ప్రగతిలో అభివృద్ధిలో ప్రతి నిత్యం  పాలుపంచుకుంటున్నారు ఇంతవరకు ఈ మహిళల పనిని గుర్తించడం,సహాయ సహకారాలు అందించడం, గౌరవించడంలో ఈ దేశ  ప్రభుత్వాలు ప్రజలు మరిచారు,ఆర్థిక భద్రతా  చట్టం ద్వారా ప్రతి మహిళకు ఆత్మ గౌరవం ఆర్థిక భద్రత లభిస్తుంది .
·       మహిళలపై అనాదినుండి జరుగుతున్న దోపిడీలనుండి రక్షించి ప్రతి మహిళకు ఆత్మ గౌరవాన్ని,పూర్తి స్వేచ్ఛను సమానత్వాన్ని ఇచ్చేది ఆర్థిక భద్రత చట్టం .
·       దేశ సమైక్యత, జాతీయ భావం, సమానత్వ, సమ సమాజ స్థాపన ఆదర్శాలతో కూడిన జీవన విధానాన్ని ప్రతి ఓటర్ నిత్య జీవితంలో ఆచరణలోకి తీసుకురావడం .అందరు కలిసి దేశం కోసం ఒక్కటిగా జీవించేటట్లు చేసేది ఆర్థిక భద్రతా చట్టం.
·       దేశంలో పౌష్టికాహార లోపంవల్ల, అనారోగ్య సమస్యల వల్ల,ఆరోగ్య సౌకర్యాల లోపం వల్ల జరుగుతున్న అన్ని రకాల వయసు గల వారి  మరణాలను ఆపేది ఆర్థిక భద్రతా చట్టం .
·       రైతు ఆత్మహత్యలను,కర్షక కార్మిక ఆర్థిక చావులను,ఆర్థిక వత్తిళ్లతో సామాన్యుల ఆత్మహత్యలను ఆపేది ఆర్థిక భద్రతా చట్టం .
·       విద్య వైద్య అవకాశాలను అందరికి అందేవిధంగా చేసేది ఆర్థిక భద్రతా చట్టం.
·       ఆర్థిక దోపిడీలను,అవినీతిని,పూర్తిగా భూస్థాపితం చేసేది ఆర్థిక భద్రతా చట్టం.
·       నేర ప్రవృతి రేటును తగ్గించి నేరాలను , హింసావాదాన్ని, తీవ్రవాదాన్ని అంతమొందిప్పచేసేది ఆర్థిక భద్రతా చట్టం .
·       ప్రతి వ్యక్తి ఆర్ధికంగా అభివృద్ధి చెందడమే దేశాభివృద్ధిగా పరిగణించడం ఆర్థిక భద్రతా చట్టం.
·       ప్రభుత్వ శాఖలల్లో వృథా ఖర్చులను పూర్తిగా తగ్గించి ,ఖజానా డబ్బులను దుర్వినియోగం కాకుండా చేసేది ఆర్థిక భద్రతాచట్టం .
·       డెబ్భై ఏళ్ల నుండి ఈ సమస్త రాజకీయ వ్యవస్థ ప్రజల డబ్బును ప్రజలకు పంచలేకపోయింది,సువిశాల భారత దేశ సంపదను ప్రతి నిత్యం రాక్షసులుగా భక్షిస్తున్నారు,ఈ వ్యవస్తకు అవస్థలకు చరమగీతం పాడేది, ప్రజల డబ్బును ప్రజలకు పంచేది ఆర్థిక భద్రతా చట్టం.
·       డెబ్భై ఏళ్ల నుండి ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనే బండిని లాగే బానిసలుగా ఓటర్ల స్థాయిని దిగజార్చారు బానిసలుగా చూస్తున్నారు. ఆర్థిక భద్రత చట్టం ద్వారా ఓటర్లను బండిని లాగే బానిసస్థాయీ నుండి యజమాని స్థాయికి చేర్చడం. ఈ ప్రజాస్వామ్య దేశంలో దేశ ఓటర్లు అందరు బండిని లాగే బానిసలూ కాదు దేశ ఓటర్లందరిదీ  బండిపైన కూర్చోవాల్సిన యజమాని స్థాయి అన్న విషయం విస్మరించరాదు .
·       పేదరికానికి కారణం డబ్బు లేమి కాదు చట్టాలు సరిగ్గా లేక పోవడం .ఆర్థిక భద్రతా చట్టం లేకపోవడం.
న్యూ ఇండియా పార్టీ

ఒకే దేశం ఒకే ఓటు ఒకే విలువ, మన దేశం మన సంపద మన హక్కు
Written by,  JpBharat (JayaPrakash Bharat),

President,ECONOMIC FREEDOM MOVEMENT, Working President, NEW INDIA PARTY,9100 505556, 9441 25 6545


Comments

Popular posts from this blog

VOTERSHIP ACT IN PARLIAMENT Representation from Economic Freedom Movement on Political Reforms.

#స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం.#సంతోషపడకండి,#బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి.