యువత సత్తా రాజకీయాల్లో, వ్యవస్థలో మార్పు ఎందుకు తీసుకు రాలేకపోతుంది, తీసుకు వచ్చే సత్తా, కేవలము యువకుల్లోనే ఉన్నది.



యువత సత్తా  రాజకీయాల్లో, వ్యవస్థలో   మార్పు ఎందుకు తీసుకు రాలేకపోతుంది,  తీసుకు వచ్చే సత్తా, కేవలము యువకుల్లోనే ఉన్నది.

రాజకీయాల్లో, వ్యవస్థలో మార్పు తీసుకు వచ్చే సత్తా, అర్హత కేవలము యువకుల్లోనే ఉన్నది.
 గత కొన్ని సంవత్సరాలుగా యువత ఎన్నో యువ సంఘాల రాజకీయ పార్టీల  ద్వారా  ఈ అంశం పై ఉదృతంగా చర్చలు,  పోరాటం చేస్తూ ఉన్నపటికీ
రాజకీయాల్లో వ్యవస్థలో ఎటువంటి మార్పు తీసుకు రాలేక పోయింది. అంతేకాదు దీనికి గల కారణాలపై ఫునః పరిశీలన కూడా సరియైన కోణంలో చెయ్యట్లేదు.
ఎందుకనగా వ్యవస్థను మరియు రాజకీయ లను మార్చడం కోసం యువత ఎన్నుకున్న మార్గం తప్పు కనుక.
దీని ద్వారా వ్యవస్థ ను, రాజకీయాలను మార్చడం కోసం ఉపయోగిస్తున్న శక్తి,  కాలం వృధా కావడంతో పాటు ఎంతోమంది యువత మరియు మార్పు కోసం పని  చేస్తున్న సామాజిక కార్యకర్తలు  సత్పలితాలు రాక నిరుత్సహంతో నిస్సహాయస్థితిలో నిరాశను ఎదుర్కొని
ఇక ఈ వ్యవస్థను మార్చలేమని ఇది సాధ్యం కాదనే శరణ్య స్థితికి చేరుకొన్నారు.
తలకాయ నొప్పి కి
కాలుకి మందు రాయడం ఎంత నిరర్థకం అవుతుందో
ఇది కూడా అంతే.
జయ ప్రకాష్ భారత్.
dated:06.03.2020



వాస్తవంగా యువత మరియు ప్రజలు ఏమి చేయాలి అనేది తెలుసుకోవడం కోసం


వాస్తవంగా యువత మరియు ప్రజలు ఏమి చేయాలి అనేది తెలుసుకోవడం కోసం
క్రింద లింక్ ఓపెన్ చేసి చదవండి.


మార్పు కోసం  కృషి చేయు  వ్యక్తికి ముక్యంగా పాటించవలసిన సూత్రాలు :


1. ముందు మార్పు మనలో రావాలి.ప్రతి వ్యక్తి జీవితంలో రావాలి.
1a). మనలో మార్పు తీసుకు రాగలిగితే , సమాజంలో మార్పు వచ్చినట్టే.

1b). మనం కోరుకుంటున్న నవ సమాజపు, నవ భారతపు మార్పులు, సంస్కరణలు రావాలంటే, సంకల్పానికి, కోరుకుంటున్న  దానికి అనుగుణంగా ముందుగా ప్రతి వ్యక్తి తనను తాను సంస్కరించుకోవాలి.

1c).తనలో ఎటువంటి మార్పు తేకుండా సమాజంలో, దేశంలో  మార్పు తీసుకు రావడం కోసం చేసే ఏ ప్రయత్నం అయినా పూర్తిగా వృధా అవుతుంది.



మిగితా విషయాలు రేపు ఇస్తాను

 జయ ప్రకాష్ భారత్.
dated:06.03.2020.





రెండవ అంశం :
యువత అర్థం చేసుకోవలసిన అంశం రెండవది ఏమనగా?
సమస్త రాజకీయ పార్టీలను, వ్యవస్థను నడిపిస్తున్నది ధనవంతులు పెట్టుబడి దారులు బడా వ్యాపార వేత్తలు. వీళ్లు తమ కు అన్యాయంగా సంక్రమించిన సంపదను ఆస్తులను తమ విలాసవంతమైన సుఖాలను ఆధిపత్యాన్ని కాపాడు కోవడం కోసం, చట్టాలను, వ్యవస్థను తమకు అనుకూలంగా ఉండేదుకు రాజకీయ పార్టీ అధ్యక్షులకు , పార్టీ లకు ఇతర సంఘాలకు అక్రమంగా డబ్బు తరలించి వారందరిని పెంపుడు కుక్కల వలే పెంచి పోషిస్తూ వ్యస్థను, రాజకీయ పార్టీలను తమ గుప్పిట్లో పెట్టుకొని ఇండైరెక్ట్ గా రాజ్యాధికారం తమ అధీనంలో పెట్టుకుట్టున్నారు.
దేశంలో ప్రజలు తమ మీద తీరగబడకుండా ఏళ్ల వేళలజాగ్రత్తలు తీసుకుంటూ అన్ని విధాలుగా కుతంత్రాలు నడిపిస్తూ ఇది ప్రజలచేత నడపబడుతున్న అతి పెద్ద ప్రజాస్వామ్యం అని దేశ ప్రజలను మభ్య పెడుతూ నమ్మబుచ్చు చున్నారు.
  కుతంత్రాలు దోపిడీలో, ప్రతి పక్షా రాజకీయ పార్టీలను, వివిధ మత కుల వర్గ ప్రాంత విభేదాలను రెచ్చ గొట్టే ఉద్యమాలను నాయకులను సంఘాలను కూడా భాగస్వామ్యం చేసి తమ అవసరాలకు వాడుకుంటున్నాయి.
ఇలాంటి సందర్భంలో యువత శక్తి, సామాజిక వేత్తలు సామాజిక కార్య కర్తలు రాజకీయాల్లో, వ్యవస్థ లో మార్పు కోసం ఎంత ప్రయత్నించినా ఎటువంటి మార్పు రాదు.
సమాజంలో, దేశంలో, రాజకీయాల్లో మరియు వ్యవస్థలో మార్పు రావాలంటే పోరాటం చేయవలసింది రాజకీయ ల్లో, వ్యవస్థను మార్పు చేయడం కోసం కాదు .
సమస్త వ్యవస్థను తమ ఆధీనంలో పెట్టుకున్న దొంగల దోపిడీదారులమీద పోరాటం చెయ్యాలి.
 న్యాయంగా అందరికి చెంద వలసిన దేశ సంపదను, కేవలము కొంతమందే అన్యాయంగా తమ గుప్పిట్లో పేట్టుకొని రాజకీయా లను, వ్యవస్థను నడుపుతూన్న వారిపై పోరాటం చెయ్యాలి. అప్పుడే దేశంలో మీరు కోరుకున్న మార్పు సాధ్యమయ్యీ సమ సమాజ స్థాపన జరుగుతుంది.
ఆర్ధిక న్యాయం ప్రజలకు చెందిన నాడే ప్రజలకు సామాజిక న్యాయం సాధ్యం.
ఆర్ధిక న్యాయం తో కూడిన స్వాతంత్రమే నిజమైన స్వాతంత్రం.
న్యాయ పరమైన మనకు చెంద వలసిన సంపదపై దొంగలని దోపిడీదార్ల చే నడపబడుతున్న రాజకీయ పార్టీలకు అధికారం ఇచ్చి సింహాసనం పై కూర్చోబెట్టి జరుగుతున్న
పరిపాలనలో ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఇంకా బానిసలేస్వాంతంత్ర్య బానిసలే.



Comments

Popular posts from this blog

#స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం.#సంతోషపడకండి,#బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి.