దేనికి బాధ పడకు, చింతిచుకు, ప్రతిస్పందించకు
దేనికి బాధ పడకు, చింతిచుకు, ప్రతిస్పందించకు
నీకు మర్యాద ఇవ్వలేదని
నీవు కోరుకున్న ప్రతిఫలం దక్కలేదని
నీవు అనుకున్నది జరగలేదని
నీవు చేసిన సహాయం మరచి పోయారని
నిన్ను దూషించారని, చిన్న చూపు చూసారని
అన్ని నిశ్చలంగా సహనంతో బుద్దితో గమనించు
ఎరుకతో స్పందించు.
ఎరుక లేకుండా దేనికి ప్రతిస్పందిచకు.
నీ లో పుడుతున్న ఆలోచనలకూ, ఆవేశాలకు, అనుమానాలకు, కోపాలకు, భావాలకు నీవే
ఎరుకతో గమనించి బుద్దితో సమాధానం వెతుక్కుంటూ ఉండాలి.
ఇతరుల వల్ల నీలో పుట్టే ఆలోచనలకు ఆవేశాలకు అనుమానాలకు భావాలకు వెంటనే ప్రతిస్పందిచకు.
ప్రతిస్పందించడం ద్వారా మీరు వారి చేష్టలకు వారి చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు.
చింతలు ఎక్కువై
చితి లాగా మనసుని శరీరాన్ని అంతర్గతంగా దహించి వేస్తాయి. తద్వారా జీవితం నుండి సుఖ సంతోషాలు ప్రశాంతత కనుమరుగై పోతాయి.
అందుకే దేనికి బాధ పడకు, చింతిచుకు, ప్రతిస్పందించకు వెంటనే.
జయ ప్రకాష్ భారత్.
27.06.2020
https://www.youtube.com/c/JpBharat
Comments
Post a Comment