జీవితం అంటేనే ఆలోచనల స్వరూపం.
జీవితం అంటేనే ఆలోచనల స్వరూపం.
నీవు ఎలా అలోచిస్తవో నీ జీవిత స్వరూపం, అలా ఉంటుంది .
ప్రారంభం _ప్రయాణం_ ముగింపు అనే చిన్న జీవితంలో సత్యం అసత్యాల ఎరుకతో ఎల్లపుడు సంతోషంగా ఉంటూ,క్షమించే గుణం ఆచరిస్తూ, ప్రేమతో కరుణ శీలివై,ధైర్యశాలివై నీ జీవితాన్ని నీవు ఆనందంగా జీవించు.
నీ జీవితంలో సంతోషం ప్రశాంతత అన్ని నీ యొక్క ఆలోచనల నుండే పుడతాయి.
నీ ఆలోచనలు,నీ ప్రతిస్పందనల మీదే నీ జీవిత విధానం, స్వరూపం ఆధారపడి ఉన్నది.
నీవు సంతోషంగా ఉన్న లేదా నీవు విచారంతో ఉన్న వాటికీ కారణం నీ ఆలోచనలే ఇంకెవరో కాదు.
ఎవ్వరికి కీడు తలపెట్టకుండా, నిజయీతిగా ఉంటూ నీ సంతోషానికి ప్రశాంతతకు ఇబ్బంది కలిగించే వాటిని ఎన్నటికి స్వీకరించకు, వాటిని ఎ మాత్రం పట్టించుకోకు, వెంటనే వాటిని వదిలెయ్యి , అవి ఇతరుల నుండి వచ్చేటువంటి మాట లైన లేదా ఆరోపనలైన,ఆలోచనలైన సరే, ఏవి పట్టించుకోకు. ఒక వేల పట్టించుకోని నీవు వాటిని స్వీకరించావో ఆ యొక్క ఆలోచనలు, విచారాలు నిన్ను వెలుతురు ఉన్నంతవరకు నీడ వెంటాడినట్టు, జీవం ఉన్నంత వరకు నిన్ను వెంటాడుతూ వేదిస్తాయి. ప్రకృతిని ఆనందించండి ప్రకృతితో జీవిచండి ప్రకృతిని కాపాడండి.
ఈ ప్రకృతి లేనిది జీవితం లేదు, మీ జీవితాన్ని వ్యర్ధ ఆలోచనలకూ దూరంగా ప్రకృతికి అతి దగ్గరగా జీవించండి.
జీవిత పరమార్ధం సంతోషంగా జీవితాన్ని జీవించడం. జీవితమంటేనే జీవిచడం. ప్రారంభం _ప్రయాణం_ ముగింపు అంతే ఇంతకంటే ఎక్కువ జీవితంలో ఇంకా ఏమిలేదు.
జయ ప్రకాష్ భారత్
29.06.2020
https://www.youtube.com/c/JpBharat
Comments
Post a Comment