అనవసరంగా మాట్లాడకు , అనవసరంగా తినకు, అనవసరంగా ఆలోచించచకు అనవసరంగా ఖర్చు పెట్టకు.
అనవసరంగా మాట్లాడకు , అనవసరంగా తినకు, అనవసరంగా ఆలోచించచకు అనవసరంగా ఖర్చు పెట్టకు. ఇవన్నీ అనవసరమే.
నిన్ను ఇతరులు మెచ్చు కోవాలని, నీ పట్ల అందరు గౌరవం చూపాలని అనవసరంగా లేని విషయాలను,మాటలను సృష్టించకు,ఆలోచించకు,ప్రతిస్పందిస్తూ ప్రవర్తించకు. తాత్కాలిక సుఖాలు విషాలు మిగులిస్తాయి ఎక్కువగా ఆలోచిస్తూ ఏదిపడితే అది చేయకు బాహ్య ప్రపంచంలో ఉన్నవాళ్లు అందరు నీలాగే ప్రవర్తించి ఇబ్బందులు పడుతున్నారు.
నీ సహజత్వాన్ని నీవు ఎన్నడు కోల్పోకు. నీ సహజత్వం నీదే, అది ఎప్పటికి నీదే.
నీ సహజత్వాన్ని ఇతరుల నుండి మెప్పు పొందడం కోసం నిన్ను నీవు మోసం చేసుకోకు.
నీ సహజత్వంలో ఉన్న ప్రేమను, నిస్వార్ధతను, నిజాయితీని దైర్యంగా ప్రదర్శించు, సంకోచించకు.
ఇతరుల నుండి మెప్పన పొందటానికి ప్రయత్నించకు,అది నీకు చివరికి దుక్కన్ని మిగులిస్తుంది.
నీవు ఎల్లప్పుడూ నీజాయితిగా సంతోషంగా ఉండు , నిత్యం వివేకంతో గమనిస్తూ,అనవసరమైన విషయానులోచనలకు బనీస కాకు, ప్రతిస్పందిచకు.నిన్ను నీవు ఎల్లప్పుడు గమనించుకో.
28.06.2020
జయ ప్రకాష్ భారత్
https://www.youtube.com/c/JpBharat
Comments
Post a Comment