ప్రజలు నిద్ర లేచే సరికి అంతా చీకటి ప్రమాదం.. తస్మాత్ జాగ్రత్త .
ప్రజలు నిద్ర లేచే సరికి అంతా చీకటి ప్రమాదం.. తస్మాత్ జాగ్రత్త .
దోపిడీ దారులు, పెట్టుబడు దారులు దోచుకుంటున్న దేశ సంపదను, ప్రబుత్వాలను తమ గుప్పిట్లో పెట్టుకొని కొనసాగిస్తున ఆదిపత్యాన్ని, ప్రభుత్వాలతో కలిసి జరుపుతున్న స్వదేశీ , విదేశీ కుటిల స్వార్ధ రహస్య ఆర్ధిక ఒప్పందాలను నిర్బయంగా ప్రశ్నించే పత్రిక, మీడియా రంగాలను ఏనాడో ధన బలంతో దోపిడిదారులు బందించారు.
దోపిడీ దారులు కొనసాగిస్తున్న దోపిడిని మరియు ప్రజాస్వామ్య పెరుమీద దేశ సంపదపై కొనసాగుతున్న ఆదిపత్యాన్ని ప్రజలు తెలుసుకొని ప్రశ్నించకుండా దోపిడీ దారులు ప్రతి నిత్యం సోషల్ మీడియా ద్వారా గోరంత కార్యక్రమాలను భారి కొండంతగా , కొండంత ప్రభుత్వ వైపల్యాన్ని ఆవగింజంత గా , ప్రతి పక్షాల రాజకీయ కుట్ర అని , జరుగుతున్నది ప్రజాస్వామ్య పరిపాలననే అని, అత్యంత కుటిల బుద్దితో దేశ ప్రజల కన్నుల్లో మత్తు మందు చల్లుతూ తిరగ బడకుండా నిద్రబుచ్చుతున్నారు .
ఎప్పుడైతే ప్రజలు ఈ మత్తు నుండి మేలుకొని, సాప కింద నీరులాగా కొనసాగుతున్న దేశ సంపద పై దోపిడి గురుంచి తెలుసుకొని సామాన్య ప్రజలు సైతం సోషల్ మీడియ మరియు ఇతర ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా తమ గొంతు ఎత్తి ప్రశ్నించడం మొదలు పెడతారో, దోపిడీ దారులు అందరు ఏకమై దేశ ఆర్ధిక సామాజిక బద్రతకు శాంతికి సమైక్యతకు సోషల్ మీడియ మరియు ఇతర ఎలక్ట్రానిక్ మీడియాల వల్ల ప్రమాదం ఉందనే విధంగా తమ పెంపుడు కుక్కలు అయిన తమ మోచెయ్యి నీళ్ళు తాగే రాజకీయ పార్టీల ద్వారా, నాయకుల ద్వారా , కిరాయి మనుషుల చేత ఇదే సోషల్ మీడియాల ద్వారా ప్రజల మద్య కుల మత ప్రాంత ఇతర కక్ష పూరిత విద్వేషాలను రెచ్చ గొట్టి చట్ట పరంగా సోషల్ మీడియా మాద్యమాలను ప్రశ్నించే ప్రజల గొంతులను మూసేస్తారు .
అందుకే కేవలం సోషల్ మీడియా ఇతర ఎలక్ట్రానిక్ మీడియాల మీద ఎక్కువ ఆధార పడకండి
ప్రత్యామ్నాయ సామాన్య ప్రజల సంఘటిత సంఘం ఎంతైనా అవసరం.
జయ ప్రకాష్ భారత్
సామాజిక,రాజకీయు సంస్కర్త , రచయిత మరియు ప్రేరణాత్మక వక్త # 9441256545
కామన్ మెన్ ఫోరం
Comments
Post a Comment