TOTAL INDEPENDENCE with DEVELOPMENT JUSTICE PEACE @JayaPrakashBharat
ఒక వ్యక్తి మరొక
వ్యక్తిని
బలవంతుడు
బలహీనున్ని
ధనవంతుడు
పేదవాన్ని దోచుకునే
వ్యవస్థనుండి
విముక్తి పొందడం.
కేవలం తిండి
కోసమే పనిచేసే బానిసత్వ వ్యవస్థ నుండి
విముక్తి పొందడం.
ప్రతి తన
కుటుంబంతో సంతోషంగా జీవించగలగడం , సమాజం పట్ల దేశం పట్ల ఉత్సహంతో పనిచేయగలగడం
ఆర్ధిక భద్రత గల, నాణ్యమైన జీవనాన్ని ప్రతి తండ్రి, ప్రతి తల్లి తన కుటుంబానికి ధైర్యంతో, నమ్మకంతో
అందించగలగడం.
ప్రతి పౌరుడు
పూర్తి ఆర్ధిక మరియు సామాజిక స్వేచ్ఛతో
మరియు జీవిత భద్రతను ఎటు వంటి వివక్షత లేకుండా ఒక ప్రాథమిక హక్కుగా కలిగిఉండండం .
విద్య లో, వైద్యంలో, ఉపాధిలో, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు , మెరుగైన
సదుపాయాలు
ఎటువంటి వివక్షత
లేకుండా ప్రతి ఒక్కరు చాలా సులువుగా పొందగలగడం.
ప్రతి
వ్యక్తి ఆర్ధిక, సామాజిక అభివృద్ధి , న్యాయం మరియు
శాంతిని పొందగలగడం.
మత ఘర్షణలు, కుల వివక్షతలు, భాష మరియు ప్రాంత అసూయలు నశించి ప్రజలందరు సకల
ప్రసంక్షేమమే ఏకైక లక్ష్యం గా ప్రతి వ్యక్తి కర్తవ్యంగా ఎల్లప్పుడూ ఏకతాటిపై నడవడం.
ప్రజలందరూ సమానత్వంతో, కర్తవ్యనిరతితో, సాటి మనిషి కూడా
తనతో సమానమనే ఆదర్శాన్ని కలిగియుండి, వ్యక్తి, సమాజ, దేశ, విశ్వ అభివృద్ధి
కొరకు, న్యాయం కొరకు మరియు
శాంతి కొరకు పనిచేయడం.
సంపూర్ణ
స్వాతంత్య్ర ఉద్యమం:
దేశ సంపద పై
ధనవంతుల ఆధిపత్యం దౌర్జన్యం నుండి విముక్తి
దేశ సంపద ఫలాలను
ప్రతి పౌరుడు పొందలేని వ్యవస్థ నుండి విముక్తి
రాజకీయలపై ధనవంతుల ఆధిపత్యం బానిసత్వం నుండి విముక్తి
సత్వర న్యాయం,
సమన్యాయం అందించలేని వ్యవస్థ నుండి విముక్తి
ధనిక పేద మద్య గల
ఆర్ధిక అసమానతల,
ఆర్ధిక వివక్షతల నుండి విముక్తి.
కుల,మత,జాతి,ప్రాంత వర్గ
విభేదాల నుండి వర్గ రాజకీయాల
నుండి విముక్తి.
ఒక వ్యక్తి ఇంకొక
వ్యక్తిని దోచుకునే వ్యవస్థ
నుండి విముక్తి
పేదవాళ్ళపై
ధనవంతుల దోపిడీ నుండి విముక్తి
బలహీనులపై
బలవంతుల దౌర్జన్యం నుండి విముక్తి
పేదరికం నుండి విముక్తి
నిరుద్యోగం నుండి విముక్తి
నిరక్షరాస్యత నుండి విముక్తి
పోషకాహారలోపం నుండి విముక్తి
శిశు మరణాల నుండి
విముక్తి
ఆకలి చావుల నుండి విముక్తి
అవినీతిని నుండి
విముక్తి
రైతాంగా సమస్యలు, రైతు ఆర్ధిక ఆత్మ
హత్యల నుండి విముక్తి
చేనేత కార్మికుల ఆత్మహత్యలు నుండి విముక్తి
కర్షక కార్మిక ఆర్ధిక ఆత్మ హత్యల నుండి విముక్తి,
వత్తిడులతో
విద్యార్థుల ఆత్మ హత్యల నుండి విముక్తి
ధనవంతుల బలవంతుల ఆర్ధిక
దోపిడలను నుండి విముక్తి
సమాన పనికి సమానం
వేతనం ఇవ్వలేని వ్యవస్థ నుండి విముక్తి
సామర్థ్యం
నైపుణ్యం గల పౌరులకు ఉద్యోగ
అవకాశాలు సృష్టించలేని వ్యవస్థ నుండి
విముక్తి
పౌరులకు ఉద్యోగాలు,
ఉపాధి అవకాశాలు కల్పించలేని
వ్యవస్థ నుండి విముక్తి
పౌరులకు జీవిత భద్రతను
కల్పించలేని వ్యవస్థ నుండి విముక్తి
మత ఘర్షణల నుండి
విముక్తి
కుల విభేదాల నుండి విముక్తి
భాషా ,
ప్రాంత ఘర్షణల నుండి విముక్తి
మహిళలపై జరుగు
వేదింపులు, దౌర్జన్యాల, హత్యా చారల నుండి విముక్తి,
సామాన్యులకు,
బలహీనులకు అధిక
పన్నుల నుండి విముక్తి
శ్రమ దోపిడీ
నుండి విముక్తి
మానవ అక్రమ రవాణా
నుండి విముక్తి
బిక్షాటన నుండి
విముక్తి
వ్యభిచారం నుండి
విముక్తి
బాల కార్మిక
వ్యవస్థ నుండి విముక్తి
సమానమైన, నైపుణ్యత గల విద్యను కల్పిచని వ్యవస్థ నుండి
విముక్తి
సమానమైన మెరుగైన
వైద్యం అందించలేని వ్యవస్థ నుండి విముక్తి
పర్యావరణాన్ని
కాపాడలేని వ్యవస్థ నుండి విముక్తి
కుటుంబ భద్రతను
అందించలేని వ్యవస్థ నుండి విముక్తి
భద్రతతో
కూడుకున్న భవిష్యత్తు ఇవ్వలేని వ్యవస్థ నుండి విముక్తి
ప్రేమతో, శాంతితో, సమానత్వంతో ,సుఖంతో కూడిన జీవనాన్ని ఎటు వంటి వివక్షత లేకుండా ప్రతి పౌరుడు
పొందలేని, ఇవ్వలేని వ్యవస్థ
నుండి విముక్తి.
_______________________
1. పోరాడండి.
2. పోరాటం చేయలేకపోతే
కనీసం పోరాటం గురుంచి పది మందికీ చెప్పండి.
3. కనీసం
చెప్పలేక కూడా పోతే, వ్రాసి సోషల్ మీడియా లేదా ఇతర సాధనాల ద్వారా అందరికి తెలియచేయండి.
4. కనీసం రాయలేక, ఇతరులకు కూడా తెలియజేయలేక పోతే, పోరాడుతున్నవారికి
కొద్దిగా సహాయం అందించండి.
5. కనీసం సహాయం
కూడా చేయలేకపోతే, పోరాడుతున్న వారి యొక్క మనో బలాన్ని పెంచే ప్రయత్నం చేయండి.
6. కనీసం ఇది
కూడా చేయలేకపోతే, పోరాడుతున్న వాడి యొక్క మనోబలాన్ని మాత్రం తెంచకండి, ఎందుకంటే మీ వంతు పోరాటం
కూడా వాడే చేస్తున్నాడు కాబట్టి.
శ్వాస లేనిదే జీవితం లేదు స్వేచ్ఛ లేని జీవితానికి అర్ధం లేదు.
ప్రశ్నించు, పోరాడు, సాధించు.బలహీనంగా జీవించకు.
బ్రతికున్నంత వరకు అన్యాయాన్ని ఎదిరించు.
మానవత్వాన్ని, సమానత్వాన్ని, ఐక్యమత్యాన్ని
ఆచరించు.
ఈ విశ్వం అంతా మన అందరిదే. అందరు సమానులే, ప్రకృతి సంపద అందరిది, సంపద ఫలాలకు అందరు హక్కు దారులే.
అజ్ఞానపు చీకటిలో బానిసలుగా జీవిస్తున్న
ఈ ప్రపంచానికి, జ్ఞానంతో కూడుకున్న చైతన్య పూర్వక వెలుతురును, శక్తిని ఇవ్వాలని నీవు సంకల్పించిన నాడు, నీవు ఒక దీపంగా మారాలి లేదా వెలుగుతున్న
ఆ దీపం యొక్క చైతన్య తేజస్సును, శక్తిని ప్రతిబింబించే అద్దంగా అయిన నీవు మారాలి.
సర్వేజనాః సుఖినోభవంతు
జయ ప్రకాష్ భారత్
సామాజిక, రాజకీయ సంస్కర్త, రచయిత మరియు ప్రేరణాత్మక వక్త.
COMMON MEN FORUM
TOTAL INDEPENDENCE MOVEMENT
DEVELOPMENT JUSTICE PEACE FORUM
H.NO: 17-1-391/S/491, ROAD NO: 1, GATE NO: 3, OPP: AUTO METER SEAL OFFICE,
SINGARENI COLONY, SAIDABAD, HYDERABAD. TELANGANA – 500059.
GMAIL: commonmenforum@gmail.com Website: commonmenforum.org
9441 25 65 45
మంచి ఉద్దేశ్యం 👌👍
ReplyDelete