COMMONMEN FORUM (సామాన్యుల సంఘం) యొక్క ముఖ్య ఉద్దేశ్యము

ఎన్నో వేల సంవత్సరాల నుండి ఈ భూమి మీద పుట్టిన సామాన్య ప్రజల ఆకాంక్ష మరియు ఆవేదన ఏమిటంటే ఎటువంటి వత్తిడులు , విభేదాలు లేకుండా సుఖంగా , సంతోషంగా ప్రకృతిలో మమేకమై ఆనందంగా బ్రతకడం. యావత్తు దేశ సంపదపై , ప్రకృతి వనరులపై ఉత్తరదాయిత్వ హక్కు ప్రజలందరు కలిగి ఉన్నారు . దేశ యావత్తు సంపద ఫలాలను అనుభవించే హక్కు కలిగి ఉండి కూడా అలనాడు బలవంతుల క్రింద బలహీనుడిగా , రాచరిక పాలనలో రాజులకు దాసులుగా , బ్రిటిష్ సామ్రాజ్య పాలనలో బానిసలుగా , ఈనాడు స్వతంత్ర భారత స్వయం పాలనలో కూడా ఒక బాధితులుగా చివరికి మిగిలిపోయాం. అలనాడు బలవంతులకు , రాజులకు , సామంతులకు , బ్రిటిష్ కు , పెట్టుబడిదారులకు మోచేయిక్రింద నీళ్లు తాగి పనిచేసిన స్వార్ధ పరులు మాత్రం సంతోషంగా , సుఖంగా బ్రతికారు , వారి కుటుంబాలు , వారి భావి తారలు కూడా బాగుపడ్డాయి . అయితే ఇప్పుడు ఈ స్వతంత్ర భారత దేశ స్వయం పాలనలో కూడా అదేవిధంగా పెట్టుబడిదారులు , ధనవంతులు రాజకీయ నాయకులు , అవినీతి ప్రభుత్వ ఉద్యోగులు , అవినీతిపరులు బాగుపడ్డారు , వారి కుటుంబాలు , వారి భావి తారలు బాగుపడ్డాయి . కానీ దేశ సామాన్య ప్రజలకు సుఖ సంతోషాలకు అ...