JANATA MANIFESTO
ఏ రాజకీయ
పార్టీకైనా శాశ్వతంగా తన పార్టీయే అధికారంలో ఉండాలనే కోరిక సర్వసాధారణం, రాజకీయ పార్టీల లక్ష్యం కూడా అలాగే ఉంటుంది, ఆ దిశలో పనిచేస్తూ ఉంటాయి ఇది తప్పు కాదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు గారు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిసారి మీ తెరాస పార్టీయే అధికారంలో ఉండే అవకాశం కచ్చితంగా ఉంది. అంతేకాదు మీరు జాతీయ పార్టీని ఏర్పాటు చేసి దేశానికి మార్గ
దర్శకులై స్వయంగా మీరే ప్రధాన మంత్రి అయ్యే అవకాశము కూడా కచ్చితంగా ఉంది. ఇది అసాధ్యం కాదు ఎందుకంటే ఏదైనా
విప్లవాత్మక మార్పులు సమాజములో తీసుకు రావాలి అంటే అది అధికారంలో ఉన్న
రాజకీయ పార్టీ ద్వారనే మాత్రమే సాధ్యం. అయితే అధికారం సమర్ధత నాయకత్వం మరియు సత్తా ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీరు ఈ రాష్ట్రానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఏదైనా చేయగలిగే సత్తా ఉందంటే అది కేవలం ఇప్పుడు మీకే మాత్రమే ఉంది. ప్రజల ఆకాంక్ష తీర్చే అధికారం మరియు సాధించే సత్తా మీ చేతిలో ఉంది.
ఇప్పుడు మీకు మీపార్టీకి కావలసిందల్లా ప్రజలకు చిత్తశుద్దితో, నిజాయితీగా, నిస్వార్థంగా, నిజంగా సేవ చేయాలనే సంకల్పం మరియు ఎంతటి కష్టానైన
ఎదుర్కునే గుండె ధైర్యం కావాలి. ఈ సంకల్పం మరియు ఈ ధైర్యం మీలో ఉంటె, ప్రజలు కూడా మీ
వెంట నడవడానికి,ఎంతటి
పోరాటానికైనా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలే కాదు యావత్తు భారత సమాజం మీ వెనక నడుస్తుంది,మిమల్ని రక్షిస్తుంది, ప్రజలు ఎప్పటికి మీ సేవలు, మిమల్ని మరచి పోరు, ప్రజలు ఎల్లకాలం మీకు రుణపడి ఉంటారు. ప్రజలు దీవిస్తారు.
మీరు చేయవలసిన
ముఖ్యమైన చట్టాలు:
1. పేద మధ్య
తరగతిలోని నిరుద్యగ యువతకు కనీసం 18000 రూపాయలతో ఉపాధి కల్పించండి.
2. ప్రభుత్వ
వ్యవసాయరంగం ద్వారా నూతన ఉపాధి
అవకాశాలు మరియు ఉత్పత్తి విధానం ద్వారా వ్యవసాయరంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేయండి. రైతు పండించిన ప్రతి పంటకు పూర్తి ఆర్ధిక స్వేచ్ఛ కల్పించండి.
3. ప్రతి మండలంలో
నూతన పరిశ్రమలు నిర్మించి నాణ్యమైన వస్తు ఉత్పత్తులు, ఎగుమతులు చేసే విధంగా, ఉపాధి అవకాశాలు
పెంచే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయండి.
4. ధనవంతులు అంటే
ఎవరు? ఒక రేఖను
అధికారికంగా గీయండి. ధనవంతుల జాబితా
తాయారు చేయండి. ధనవంతులకు
ప్రత్యేక పన్ను విధానం అమలు చేయండి. రాజకీయాల్లో 5% రిజర్వేషన్ ధనవంతులకు ఇవ్వండి.
5. ప్రజల వద్ద ఉన్న
అన్నీ రకాల ఆస్తులను వాస్తవ
మార్కెట్టు ధరకు లెక్కకట్టి ఒక నిర్దిష్ట మైన నిజమైన పేద మరియు మధ్య తరగతి ప్రజలను గుర్తించండి, ఒక రేఖను అధికారికంగా గీయండి. ఉపాధి, సంక్షేమ అవకాశాలు
అర్హులైన నిజమైన పేద మరియు మధ్య తరగతి ప్రజలకే అందాలి.
6. భూములు, ఇతర సంపదలు వాస్తవంగా కొనుగోలు అమ్మకాలు జరుగుతున్న ధరలకే
ప్రజలు పన్నులు చెల్లించే విధంగా కఠినమైన చట్టాలు చేయండి.
7. స్వంత ఆస్తి అంటూ
లేని పేద మధ్య తరగతి ప్రజలకు స్థలం కేటాయించండి.
8. రాష్ట్రంలో నాణ్యమైన సమానమైన విద్యా, వైద్యం ప్రైవేట్ వ్యవస్థకు దీటుగా ప్రజలకు ఉచితంగా అందేవిధంగా గ్రామ స్థాయి నుండి చేయండి.
9. రాష్ట్రంలో
అక్రమార్కుల చేతిలో ఉన్న ప్రతి అవినీతి పైసాను బందు ప్రీతీ, మిత్ర ప్రీతీ,పార్టీ ప్రీతీ, ఇంకా ఎటువంటి బేధాలు, భయాలు లేకుండా ప్రతి పైసా ఏ మూలా ఉన్న వెన్నక్కి
తీయండి ఓటర్ వెల్ఫేర్ ఫండ్లో జమచేయండి.
10.
సమాన పనికి సమాన వేతనం వెంటనే అన్ని రంగాల్లో అములు
చట్టాలు చేయండి.
11.
కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగ భద్రతను
కల్పిస్తూ పర్మినెంట్ చేయండి.
12.
ఒక్క ప్రభుత్వ పోస్ట్ కూడా ఖాళీ లేకుండా అన్నీ ఖాళీలు భర్తీ చేయండి.
13.
ప్రజందరికీ అందుబాటులో గ్రామ స్థాయి నుండి ప్రభుత్వ
సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేయండి. ప్రజలు ప్రతి
నిత్యం చెల్లిస్తున్న పన్నులు నేరుగా
ఎటువంటి అవినీతి జరగకుండా ప్రభుత్వ ఖజానాకు చేరుతాయి.
14. మంచినీరు,విద్యుత్తు,గ్యాస్ సేవలను
పేద,మధ్యతరగతి
ప్రజలకు తక్కువ ధరలకు అందించండి.
15.
ఇంటి, వ్యాపార రుణాలు
అర్ధ రూపాయి వడ్డీకే పేద, మధ్య తరగతి
ప్రజలకు అందించండి.
16.
రాజకీయ లబ్ధి కోసం ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన ప్రజా
పథకాలను వెంటనే రద్దు చేయండి.
17.
ప్రభుత్వ వృధా ఖర్చులను, ఆడంబర ఖర్చులను పూర్తిగా నిషేదించండి.
18.
కులరహిత,మత రహిత సమాజాన్ని ప్రోత్సహించి ప్రభుత్వం నుండి
ఆర్ధిక సహాయం చేయండి.
19.
ఏ ఆధారం లేని వృద్దులకు , వికలాంగులకు 6000 రూపాయలతో చేత నిది
అందింవండి.
20.
విద్యా, వైద్యం, న్యాయం, ఉపాధి, నివాసం, ఆర్ధిక, సామాజిక అభివృద్ధి అవకాశాలు పేద,మధ్య,ధనిక అనే వత్యాసం లేకుండా అందరకీ అందే విధంగా ప్రతి
గ్రామంలో ప్రతి మడలంలో ప్రతి జిల్లాలో ప్రజా పరిషత్ అనే ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు
చేయండి. ఈ శాఖ ముఖ్యమంత్రి
మరియు ఇతర మంత్రి మండలి సభ్యుల పర్యవేక్షణలో నడవాలి. సమస్యల పరిష్కారం డిజిటల్ రూపంలో ఎప్పటికప్పుడు
ప్రజలకు అందాలి.
రాష్ట్రంలో ప్రజలు అన్ని ఓట్లు మీ పార్టీకే వేస్తారు. అన్ని సీట్లు మీరే గెలుస్తారు. ప్రతి పక్షం లేని మొదటి రాష్ట్రం తెలంగాణగా
అవతరిస్తుంది. ప్రతి రాష్ట్రం
తెలంగాణ ప్రభుత్వ విధానం కోరుకుంటుంది. యావత్తూ దేశము గర్విస్తుంది. ప్రజలూ
ఎల్లకాలం మీకు రుణపడి ఉంటారు. సమాజములో అన్ని
సమస్యలు మాకే తెలుసు అని, అన్ని సమస్యలను మేమె పరిష్కరిస్తామనేది మా ధోరణి కానే కాదు.
ఇక్కడ అందరం కలిసి కట్టుగా, విడిపోకుండా ప్రజల కనీస అవసరాలను,సమస్యలను తీర్చాలన్నదే మా సంకల్పం.
ఇదే చేసే
నిజాయితీగల సంకల్పం, ఎంతటి కష్టాననైన
ఎదుర్కునే గుండె ధైర్యం మీకు ఉందని మేము భావిస్తున్నాము, ప్రజలు కూడా మీ వెంట నడవడానికి,ఎంతటి పోరాటానికైనా
సిద్ధంగా ఉన్నారు.ఈ సత్తా మీకు మీ
పార్టీకి ఉందా లేదా తేల్చి చెప్పండి. మీరు ఈ చట్టాలను అమలు చేయకుంటే ప్రజా శక్తిని మేల్కొలిపి, ప్రజలందరం ఏకమై ఒక ఓటర్ శక్తి ఎదిగి, ఒక నూతన రాజకీయ పార్టీను ఏర్పాటు చేసి పై చట్టాలను అమలు
పరచుకుంటాము.
జై జనతా …..జై జై జనతా జై భారత్…..జై ధరిత్రి.
VOTER
JAYA PRAKASH BHARAT
Comments
Post a Comment