COMMONMEN FORUM (సామాన్యుల సంఘం) యొక్క ముఖ్య ఉద్దేశ్యము

 



ఎన్నో వేల సంవత్సరాల నుండి ఈ భూమి మీద పుట్టిన సామాన్య ప్రజల ఆకాంక్ష మరియు ఆవేదన ఏమిటంటే ఎటువంటి వత్తిడులు, విభేదాలు లేకుండా సుఖంగా, సంతోషంగా ప్రకృతిలో మమేకమై ఆనందంగా బ్రతకడం. యావత్తు దేశ సంపదపై, ప్రకృతి వనరులపై ఉత్తరదాయిత్వ హక్కు ప్రజలందరు కలిగి ఉన్నారు. దేశ యావత్తు సంపద ఫలాలను అనుభవించే హక్కు కలిగి ఉండి కూడా అలనాడు బలవంతుల క్రింద బలహీనుడిగా, రాచరిక పాలనలో రాజులకు దాసులుగా,   బ్రిటిష్ సామ్రాజ్య పాలనలో బానిసలుగా, ఈనాడు స్వతంత్ర భారత స్వయం పాలనలో కూడా ఒక బాధితులుగా చివరికి మిగిలిపోయాం.

అలనాడు బలవంతులకు, రాజులకు, సామంతులకు, బ్రిటిష్ కు, పెట్టుబడిదారులకు మోచేయిక్రింద నీళ్లు తాగి పనిచేసిన స్వార్ధ పరులు మాత్రం సంతోషంగా,సుఖంగా బ్రతికారు, వారి కుటుంబాలు, వారి భావి తారలు కూడా బాగుపడ్డాయి. అయితే ఇప్పుడు ఈ స్వతంత్ర భారత దేశ స్వయం పాలనలో కూడా అదేవిధంగా పెట్టుబడిదారులు, ధనవంతులు రాజకీయ నాయకులు, అవినీతి ప్రభుత్వ ఉద్యోగులు, అవినీతిపరులు బాగుపడ్డారు, వారి కుటుంబాలు, వారి భావి తారలు బాగుపడ్డాయి. కానీ దేశ సామాన్య ప్రజలకు సుఖ సంతోషాలకు అప్పడు దూరంగే ఉన్నారు ఇప్పుడు కూడా దూరంగే ఉన్నారు, సుఖ సంతోషలు సంపదలో భాగస్వామ్యం, సంపదనును అనుభవించే హక్కు అందని ద్రాక్ష ఫలాలుగా మిగిలాయి.

దేశ సామాన్య ప్రజలు సుఖ సంతోషాలు అనుభవిచక పోవడానికి కారణం, వ్యతిరేక మనసత్త్వం మరియు గుణం గలిగిన ప్రజలు. ఈ ప్రకృతి, ప్రతి వ్యక్తికి ఎటువంటి తారతమ్యాలు లేకుండా  ప్రకృతి సంపదను శక్తిని సమానంగా అనుభవించే అవకాశం మరియు హక్కు కల్పించింది. కానీ కొంతమంది దౌర్జన్య రాక్షసులు, బలవంతులు సామాన్య ప్రజల యొక్క అజ్ఞానాన్ని, బలహీనత్వాన్ని అవకాశంగా మార్చుకొని, ప్రకృతి సంపదను అనాది నుండి సామాన్య ప్రజలని, సకల సంపదను ఇప్పటి వరకు ఇంకా దోపిడీ చేస్తూనే ఉన్నారు. సుఖ భోగాలను, సంతోషాలను వారు మాత్రమే, వారి కుటుంబాలు మాత్రమే  దేశ సంపదకు యజమానులుగా కొనసాగుతు అనుభవిస్తున్నారు. ఈ భూమి మీద వందకు తొంబై మంది ప్రజలు, పది మంది దోపిడీదారుల, స్వార్ధ పరుల క్రింద బానిసలుగా బ్రతకవలసిందేనా? ఇందుకోసమేనా ఈ  90 మంది ఈ మట్టిలో పుట్టింది.

 

 

ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఈ భూమి మీద, భూమి లోపలి అన్నిరకాల సంపదపై, నదులపై, పర్వతాల పై, కొండలపై, సముద్రాలపై, సాగర గర్భంలోని ముత్యాలపై, సాగర గర్భంలోని ఇతర సంపదపై, ఈ భూమి పై గల సమస్త ప్రకృతి సంపదపై, ప్రకృతి ద్వారా సృష్టించ బడుతున్న సంపదపై శక్తిపై ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి పూర్తి స్వేచ్ఛతో, ఎటువంటి వివక్షత, అసమానతలు లేకుండా సుఖంగా సంతోషంగా సమానంగా అనుభవించే హక్కు ఉంది.

మా (COMMONMEN FORUM) సామాన్యుల సంఘం యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏమిటంటే:

1.      ప్రతి మనిషి మరియు ప్రతి కుటుంబం అన్ని వసతులు, సౌకర్యాలతో, అవకాశాలతో, సంతోషంగా, సుఖంగా, స్వేచ్ఛగా జీవించాలి. దీనినే సంపూర్ణ స్వాతంత్య్రం అంటాము  ఈ యొక్క సంపూర్ణ స్వాతంత్య్రం కోసమే మా పోరాటం. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేందుకు సర్వదా కృషి చేస్తాము.

2.      సమస్త జీవులకు సకల సంపదలకు కారణం. ఈ ప్రకృతిని ప్రజలు సర్వదా కాపాడాలి, ప్రకృతిలో మమేకమై జీవించాలి. ప్రకృతిని సర్వదా కాపాడేందుకు సర్వదా కృషి చేస్తాము.

3.      దేశ సంపదకు అందరు సమానంగా హక్కు దారులు. ఈ సంపద యొక్క ప్రతి ఫలాలను ప్రతి మనిషి ఒక ప్రాథమిక హక్కుగా పొంది సుఖ సంతోషాలు అనుభవించాలి. దేశ సంపదలో ప్రతి మనిషిని భాస్వామ్యం చేయడం కోసం, సంపద ఫలాలను ప్రతి మనిషి అనుభవించేలా సర్వదా కృషి చేస్తాము.

దేశ సంపదలో ప్రతి మనిషిని ఎందుకు భాగస్వామ్యం చేయాలంటే?

1.      దేశ సంపదకు దేశ ప్రజలందరు సమానంగా హక్కు దారులు

2.      ఇది రాచరికం కాదు ప్రజాస్వామ్యం దేశ సంపదకు దేశ ప్రజలే రాజులు, పరిపాలకులు ప్రజల సేవకులు మాత్రమే

3.      ఆర్ధిక న్యాయం జరగకుండా సామాజిక న్యాయం జరగదు

4.      ప్రతి కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆహారం, నివాసం కావాలి ఇది ప్రజల రాజ్యంగా పరమైన హక్కులు.

5.      ఉపాధి, వ్యాపార అవకాశాలతో ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి. ఇది ప్రజల ఆర్ధిక స్వేచ్ఛ, ఆర్ధిక స్వేచ్ఛ ప్రతి పౌరుడి యొక్క జన్మహక్కు.

6.      మనసుకు నచ్చని వృత్తులను వత్తిళ్లకు బయపడో, గత్యంతరం లేకోనో బలవంతంగా ఎంచుకోకుండా, మనసుకు నచ్చిన వృత్తులను పూర్తి స్వేచ్ఛతో ప్రతి మనిషి ఎంచుకొని అవకాశాలు కలిగి ఉండాలి.

 

ప్రతి మనిషి ప్రతి కుటుంబం సంతోషంగా సుఖంగా జీవించాలంటే ప్రజలకు ఏమి కావాలి ?

ప్రతి మనిషి, ప్రతి కుటుంబం సంతోషంగా సుఖంగా జీవించాలంటే మనందరికీ కావలసింది ప్రతి మనిషి కి స్థిరమైన ఆస్తి , ఆదాయం మరియు చేతిలోడబ్బు కావాలి. కుటుంబాల వద్ద డబ్బు లేకుంటే ప్రతి వ్యక్తి సంతోషంగా జీవనాన్ని కుటుంబంతో గడపలేడు. స్నేహితులతో బంధువులతో, సమాజంలో ఇతరులతో సంతోషంగా గడపలేడు. కుటుంబంలో ప్రతి వ్యక్తికి సమస్యలు, వత్తిళ్లు, భాదలు, వేధింపులు ఉంటాయి. వ్యక్తి సుఖంగా ఉండడు. అనారోగ్య సమస్య , వేధింపుల సమస్య , దోపిడీ

 

సమస్య, ఆత్మ హత్యల సమస్య, పేదరికం సమస్య, అవినీతి సమస్య, పోషకాహార సమస్య, నేరాల సమస్యలు పెరుగుతాయి. ప్రతి నిత్యం ఆర్ధిక ఇబ్బందులతో మనిషి దుఖఃములో ఉంటాడు.  కుటుంబం సుఖంగా ఉండదు, సమాజం సుఖంగా ఉండదు, దేశం సుఖంగా సుభిక్షంగా ఉండదు.

ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం సుఖంగా సంతోషంగా ప్రకృతిలో మమేకమై జీవించాలంటే ఈ దేశ సంపదపై మరియు సంపద సృష్టించు ప్రతి ఫలాలను ప్రతి వ్యక్తి ఒక ప్రాథమిక హక్కుగా పొందాలి. ఆర్ధిక స్వాంత్య్రం, ఆర్ధిక శక్తి,  ప్రజల చేతికి దక్కిననాడు ప్రజలు తమ జీవితాలకు కావలసిన అన్ని సౌకర్యలు ప్రజలందరూ కలిసి సమిష్టిగా నిర్మించుకుంటారు.

ఆర్ధిక స్వాంత్య్రం, ఆర్ధిక శక్తితో, ప్రజలు రాజకీయ  పార్టీల  యొక్క బానిసత్వం నుండి విముక్తి పొందుతారు. తమకు కావలసిన నాయకున్ని ఎటువంటి ప్రలోభాలకు,ఇతర ఆర్ధిక సామాజిక శక్తులకు లోను కాకుండా ఎన్నుకుంటారు. దేశ ప్రజలకు దేశ సంపదలో రాజ్యంగా చట్టం ప్రకారం రావలసిన న్యాయమైన వాటాను ప్రాథమిక  హక్కుగా కలిపించండి. పౌరులందరికీ ఆర్ధిక స్వాతంత్య్రం ఇవ్వండి.

లేదా

ప్రభుత్వాలు తక్షణం ప్రజలందరికి  సమానమైన విద్య, వైద్యం, ఆరోగ్యం, నివాసం, ఉపాధి, వ్యాపార అవకాశాలు ఎటువంటి వివక్షత లేకుండా అందించాలి. ప్రైవేట్ యాజమాన్యం, ఆధిపత్యం, దోపిడీ లేకుండా. దేశ సంపదపై ఆధిపత్యం ఏ కొద్దీ మంది చేతిలోనే కేంద్రీకృతం కాకుండా అందరికి సమానంగా పంచండి. కుల మత ప్రాంత వర్గ విభేదాలు నశింపజేయండి. అభివృద్ధి న్యాయం విషయంలో ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా అందరికి సమాన అవకాశాలు అందేలా చేయండి.

ఈ మార్పు కోసం, అవకాశాల కోసం, సుఖ సంతోషాల కోసం సామాన్య ప్రజలు 75 సంవత్సరాలనుండి ఎదురు చూస్తూనే  ఉన్నారు. ప్రజలందరు ఎటువంటి అసమానతలు లేకుండా ఆనందంగా జీవించాలి. సమ సమాజ స్థాపన జరగాలి.

సర్వే జనః సుఖినోభవంతు

JAYA PRAKASH BHARAT

Political Social Reformer & Motivational Speaker.

President_CommonMen Forum. 9441256545


Comments

Popular posts from this blog

VOTERSHIP ACT IN PARLIAMENT Representation from Economic Freedom Movement on Political Reforms.

#స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం.#సంతోషపడకండి,#బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి.