Posts

Showing posts from August, 2020

#స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం.#సంతోషపడకండి,#బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి.

Image
  ఈ స్వాతంత్య్ర దినోత్సవానికి #సంతోషపడకండి , #బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి. #స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం. #15ఆగస్ట్ : 1. సగటు సామాన్యుని దగ్గర 26,666 ఆదాయం లేదు. 2. సగటు సామాన్యుని దగ్గర 26,666 జమ లేదు. 3. ప్రతి నెల కనీస కుటుంబ కర్చు 26,666 లు అవసరం కానీ దీనికి దారి, దిక్కు లేదు. 4. చెప్పుకోడానికి దేశం అంతా అందరిదే కానీ సంపద కొందరు మాత్రమే దర్జాగా అనుభవిస్తున్నారు. 5. సగటు సామాన్యునికి సొంత ఇల్లు లేదు. 6. కనీస జీవన భద్రత లేదు. 7. స్వాతంత్య్ర భారతీయు లము అనే పేరు అందరకీ వచ్చింది కానీ సంపద ఫలాలు మాత్రము వాస్తవంగా కొందరి చేతికే వచ్చాయి. 8. ధనవంతు లు,దోపిడీ దార్లు అప్పులను కూడా ఆస్తులుగా మార్చు కుంటు ఉన్నారు. 9. ధనవంతుల,దోపిడీ దార్ల, కుటుంబాలు బలవంతులుగా , గుణవంతు లుగా, దేశ నాయకులుగా, రాజకీయ శక్తులుగా, ఆధిపత్య శక్తులుగా ఎదిగారు. 10. మధ్యతరగతి వాడు పెడవడిగా మారుతున్నాడు , పేదవా డు ఇంకా పేద వడిగా ఉన్నాడు. మనిషిని మనిషి దోచు కుంటున్నాడు.ఆర్ధిక అసమానతలు మరియు ఆర్ధిక నరసంహారాలు పెరిగిపోయాయి . 11. ఆర్థిక భద్రత / VOTER SHIP_...

దేనికి బాధ పడకు, చింతిచుకు, ప్రతిస్పందించకు

Image
  దేనికి బాధ పడకు, చింతిచుకు, ప్రతిస్పందించకు నీకు మర్యాద ఇవ్వలేదని నీవు కోరుకున్న ప్రతిఫలం దక్కలేదని నీవు అనుకున్నది జరగలేదని నీవు చేసిన సహాయం మరచి పోయారని నిన్ను దూషించారని, చిన్న చూపు చూసారని అన్ని నిశ్చలంగా సహనంతో బుద్దితో గమనించు ఎరుకతో స్పందించు. ఎరుక లేకుండా దేనికి ప్రతిస్పందిచకు. నీ లో పుడుతున్న ఆలోచనలకూ, ఆవేశాలకు, అనుమానాలకు, కోపాలకు, భావాలకు నీవే ఎరుకతో గమనించి బుద్దితో సమాధానం వెతుక్కుంటూ ఉండాలి. ఇతరుల వల్ల నీలో పుట్టే ఆలోచనలకు ఆవేశాలకు అనుమానాలకు భావాలకు వెంటనే ప్రతిస్పందిచకు. ప్రతిస్పందించడం ద్వారా మీరు వారి చేష్టలకు వారి చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు. చింతలు ఎక్కువై చితి లాగా మనసుని శరీరాన్ని అంతర్గతంగా దహించి వేస్తాయి. తద్వారా జీవితం నుండి సుఖ సంతోషాలు ప్రశాంతత కనుమరుగై పోతాయి. అందుకే దేనికి బాధ పడకు, చింతిచుకు, ప్రతిస్పందించకు వెంటనే. జయ ప్రకాష్ భారత్. 27.06.2020 https://www.youtube.com/c/JpBharat

అనవసరంగా మాట్లాడకు , అనవసరంగా తినకు, అనవసరంగా ఆలోచించచకు అనవసరంగా ఖర్చు పెట్టకు.

Image
అనవసరంగా మాట్లాడకు , అనవసరంగా తినకు, అనవసరంగా ఆలోచించచకు అనవసరంగా ఖర్చు పెట్టకు. ఇవన్నీ అనవసరమే. నిన్ను ఇతరులు మెచ్చు కోవాలని, నీ పట్ల అందరు గౌరవం చూపాలని అనవసరంగా లేని విషయాలను,మాటలను సృష్టించకు,ఆలోచించకు,ప్రతిస్పందిస్తూ ప్రవర్తించకు. తాత్కాలిక సుఖాలు విషాలు మిగులిస్తాయి ఎక్కువగా ఆలోచిస్తూ ఏదిపడితే అది చేయకు బాహ్య ప్రపంచంలో ఉన్నవాళ్లు అందరు నీలాగే ప్రవర్తించి ఇబ్బందులు పడుతున్నారు. నీ సహజత్వాన్ని నీవు ఎన్నడు కోల్పోకు. నీ సహజత్వం నీదే, అది ఎప్పటికి నీదే. నీ సహజత్వాన్ని ఇతరుల నుండి మెప్పు పొందడం కోసం నిన్ను నీవు మోసం చేసుకోకు. నీ సహజత్వంలో ఉన్న ప్రేమను, నిస్వార్ధతను, నిజాయితీని దైర్యంగా ప్రదర్శించు, సంకోచించకు. ఇతరుల నుండి మెప్పన పొందటానికి ప్రయత్నించకు,అది నీకు చివరికి దుక్కన్ని మిగులిస్తుంది. నీవు ఎల్లప్పుడూ నీజాయితిగా సంతోషంగా ఉండు , నిత్యం వివేకంతో గమనిస్తూ,అనవసరమైన విషయానులోచనలకు బనీస కాకు, ప్రతిస్పందిచకు.నిన్ను నీవు ఎల్లప్పుడు గమనించుకో. 28.06.2020 జయ ప్రకాష్ భారత్ https://www.youtube.com/c/JpBharat  

జీవితం అంటేనే ఆలోచనల స్వరూపం.

Image
  జీవితం అంటేనే ఆలోచనల స్వరూపం. నీవు ఎలా అలోచిస్తవో నీ జీవిత స్వరూపం, అలా ఉంటుంది . ప్రారంభం _ప్రయాణం_ ముగింపు అనే చిన్న జీవితంలో సత్యం అసత్యాల ఎరుకతో ఎల్లపుడు సంతోషంగా ఉంటూ,క్షమించే గుణం ఆచరిస్తూ, ప్రేమతో కరుణ శీలివై,ధైర్యశాలివై నీ జీవితాన్ని నీవు ఆనందంగా జీవించు. నీ జీవితంలో సంతోషం ప్రశాంతత అన్ని నీ యొక్క ఆలోచనల నుండే పుడతాయి. నీ ఆలోచనలు,నీ ప్రతిస్పందనల మీదే నీ జీవిత విధానం, స్వరూపం ఆధారపడి ఉన్నది. నీవు సంతోషంగా ఉన్న లేదా నీవు విచారంతో ఉన్న వాటికీ కారణం నీ ఆలోచనలే ఇంకెవరో కాదు. ఎవ్వరికి కీడు తలపెట్టకుండా, నిజయీతిగా ఉంటూ నీ సంతోషానికి ప్రశాంతతకు ఇబ్బంది కలిగించే వాటిని ఎన్నటికి స్వీకరించకు, వాటిని ఎ మాత్రం పట్టించుకోకు, వెంటనే వాటిని వదిలెయ్యి , అవి ఇతరుల నుండి వచ్చేటువంటి మాట లైన లేదా ఆరోపనలైన,ఆలోచనలైన సరే, ఏవి పట్టించుకోకు. ఒక వేల పట్టించుకోని నీవు వాటిని స్వీకరించావో ఆ యొక్క ఆలోచనలు, విచారాలు నిన్ను వెలుతురు ఉన్నంతవరకు నీడ వెంటాడినట్టు, జీవం ఉన్నంత వరకు నిన్ను వెంటాడుతూ వేదిస్తాయి. ప్రకృతిని ఆనందించండి ప్రకృతితో జీవిచండి ప్రకృతిని కాపాడండి. ఈ ప్రకృతి లేనిది జీవితం లేదు, మీ జ...

సాదారణంగా సమాజంలో జనం నిజం వినడానికి ఇష్టపడరు,

Image
  సాదారణంగా సమాజంలో జనం నిజం వినడానికి ఇష్టపడరు, ఎందుకంటే వారు ఎప్పటినుండో పెంచుకున్న్న వారి నమ్మ కాలు బ్రమలు ఆలోచనలు అన్ని కూడా ఎక్కడ అబద్దం అవుతాయని వారి బయం. అందుకే ఈ జనం నిజం మాట్లాడే వానితో కన్నా ఇతరులతో ఎక్కువగా కలిసి వుంటారు . చీకట్లో నడిచే వాడి కన్నా అజ్ఞానంతో నడిచే వాడి జీవినం బాధాకరం . సత్యానికి కన్నా అసత్యానికి ఎప్పుడు తోడు ఎక్కువగా ఉంటుంది . " సత్యానికి తోడు అవసరం లేదు ఎందుకంటే అదే సత్యం కనుక" . జయ ప్రకాష్ భారత్ 06.07.2020 https://www.youtube.com/c/JpBharat

బ్రతికి ఉన్నంత కాలం ప్రశ్నించు పోరాడు సాధించు.

Image
  బ్రతికి ఉన్నంత కాలం ప్రశ్నించు పోరాడు సాధించు. సమానత్వాన్ని మానవత్వాన్ని ఆచరించు. సంతోషంగా జీవించు, మరణించు. ఇదే జీవితం. బయట లోపట ఒకేలా ఉండు. జీవితం అంటేనే ఆలోచనల స్వరూపం. నీవు ఎలా అలోచిస్తవో నీ జీవిత స్వరూపం, అలా ఉంటుంది . ప్రారంభం _ప్రయాణం_ ముగింపు అనే చిన్న జీవితంలో సత్యం అసత్యాల ఎరుకతో ఎల్లపుడు సంతోషంగా ఉంటూ,క్షమించే గుణం ఆచరిస్తూ, ప్రేమతో కరుణ శీలివై,ధైర్యశాలివై నీ జీవితాన్ని నీవు ఆనందంగా జీవించు. నీ జీవితంలో సంతోషం ప్రశాంతత అన్ని నీ యొక్క ఆలోచనల నుండే పుడతాయి. నీ ఆలోచనలు,నీ ప్రతిస్పందనల మీదే నీ జీవిత విధానం, స్వరూపం ఆధారపడి ఉన్నది. నీవు సంతోషంగా ఉన్న లేదా నీవు విచారంతో ఉన్న వాటికీ కారణం నీ ఆలోచనలే ఇంకెవరో కాదు. ఎవ్వరికి కీడు తలపెట్టకుండా, నిజయీతిగా ఉంటూ నీ సంతోషానికి ప్రశాంతతకు ఇబ్బంది కలిగించే వాటిని ఎన్నటికి స్వీకరించకు, వాటిని ఎ మాత్రం పట్టించుకోకు, వెంటనే వాటిని వదిలెయ్యి , అవి ఇతరుల నుండి వచ్చేటువంటి మాట లైన లేదా ఆరోపనలైన,ఆలోచనలైన సరే, ఏవి పట్టించుకోకు. ఒక వేల పట్టించుకోని నీవు వాటిని స్వీకరించావో ఆ యొక్క ఆలోచనలు, విచారాలు నిన్ను వెలుతురు ఉన్నంతవరకు నీడ వెంటాడినట్టు, జ...

ఈ దేశంలో ఓటర్లు ఓటు వేస్తుంది రాజకీయ నాయకుల ఆస్తులు పెంచ డానికి.

Image
  ఈ దేశంలో ఓటర్లు ఓటు వేస్తుంది రాజకీయ నాయకుల ఆస్తులు పెంచ డానికి. 5 ఏండ్ల కొకసారి నాయకున్ని ఎన్నుకోవడం ఆ తరువాత మళ్ళీ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారో అనే పనికి మాలిన లెక్కలు వేసుకువడం మేకలు కసాయిని నమ్మడం ఓటర్లు ప్రతి సారి మోసపోవడం ప్రజల ఖజానాను నాయకులు పెట్టుబడిదారులు కొల్లగొట్టడం ధరలు పెరిగితే ధర్నాలు చేయడం 70ఏండ్ల దారిద్య్రాన్ని దోపిడీని మోయడం ముందు నుండి పోతున్న చీమల దోపిడీ పై పోరాటాలు వెనుకాల నుండి పోతున్న ఏనుగుల దోపిడీ పై నిశబ్దాలు. ఒక దేశం బాగుపడ్డ నాశనమైన దానికి కారణం ఆ దేశ ఓటరే. నీళ్ళు ఇచ్చి నెయ్యి కోరుకోవడం ఎంత మూర్కత్వమో నిస్వార్ద నాయకులను ఎన్నుకోకుండా నీతి, నిజాయితి, న్యాయం, సమన్యాయం అనే విలువలతో కూడుకున్న ప్రజాస్వామ్యం కావాలని ప్రజలు కోరుకోవడం కూడా అంతే మూరకత్వం . 11.07.2020 జయప్రకాష్ భారత్ https://www.youtube.com/c/JpBharat

నీళ్ళు ఇచ్చి నెయ్యి కోరుకోవడం ఎంత మూర్కత్వమో

Image
నీళ్ళు ఇచ్చి నెయ్యి కోరుకోవడం ఎంత మూర్కత్వమో నిస్వార్ద నాయకులను ఎన్నుకోకుండా నీతి, నిజాయితి, న్యాయం, సమన్యాయం అనే విలువలతో కూడుకున్న ప్రజాస్వామ్యం కావాలని ప్రజలు కోరుకోవడం కూడా అంతే మూరకత్వం . ఏనాడూ మంచి వాణ్ణి ఎన్నుకున్నారని? ఏనాడూ మంచి వాణ్ణి గుర్తించారని ? మేకలు ఎప్పుడు కసాయినే నమ్ముతాయి# నిజాయితిగా బతకరు >నిజాయితిని బతక నియ్యరు. నాయకులూ మారారు@ఎందుకంటే వాళ్ళు ఎలాగైతే ఉన్నరో వాళ్ళు అలాగే మెజారిటి ప్రజల ఆలోచనలనుండి పుట్టారు కనుక. మెజారిటీ ప్రజల ఆలోచన మారితే నాయకులూ మారతారు . ప్రజలు మారకుండా నాయకులు సమాజం మారదు . జయ ప్రకాష్ భారత్ 11.07.2020 https://www.youtube.com/c/JpBharat